Home » Greengram
ఆంద్రప్రదేశ్ లో రబీ పంటగా కృష్ణా, గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. కృష్ణా, గోదావరి మండలాల్లో వరిమాగాణుల్లో నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకునే అవకాశం ఉంది.
పెసర దాదాపు లక్ష హెక్టార్లలో సాగవుతుంది. వివిధ ప్రాంతాల్లో ఆయా సమయానికి అనువైన రకాలను రైతులు ఎన్నుకోవాలి. పెసరలో ఏడాది పొడవున వేసుకునే రకాలు కూడా ఉన్నాయి.
ఖరీఫ్ లో ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాల్లోను, సెప్టెంబరు రెండవ పక్షం నుండి అక్టోబరులో రబీపంటలు సాగుచేసే రైతాంగం తొలకరిలో పెసరను సాగుచేస్తున్నారు.. ప్రస్థుతం పైరు 20 నుండి 35 రోజుల దశ వరకు వుంది.
పెసర వర్షాధారపు పంట. కాని వర్షాభావ పరిస్థితులేర్పడినప్పుడు ఒకటి, రెండు నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. పెసరకు 25 నుండి30 రోజుల దశలో ఒకసారి, 45 నుండి 50 రోజుల దశలో మరోసారి తేలిక పాటి తడులు ఇవ్వాలి. పూత దశలో నీటితడులు ఇవ్వకూడదు.
వేసవి పెసర సాగులో రైతులు సస్యరక్షణ పట్ల అత్యంత మెలకువగా వ్యవహరించాలి. ముఖ్యంగా నాటిన తొలిదశలో పైరుకు చిత్తపురుగుల బెడద ఎక్కువగా వుంటుంది. పైరు రెండాకుల దశలో లేత ఆకులను ఆశించి, రంధ్రాలు చేయటం వల్ల ఆకులు జల్లెడగా మారిపోతాయి.