Green Gram Cultivation : ఖరీఫ్ పెసర రకాలు.. సాగులో మెళకువలు
పెసర వర్షాధారపు పంట. కాని వర్షాభావ పరిస్థితులేర్పడినప్పుడు ఒకటి, రెండు నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. పెసరకు 25 నుండి30 రోజుల దశలో ఒకసారి, 45 నుండి 50 రోజుల దశలో మరోసారి తేలిక పాటి తడులు ఇవ్వాలి. పూత దశలో నీటితడులు ఇవ్వకూడదు.

Green Gram Cultivation
Green Gram Cultivation : ఖరీఫ్ లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడి, తక్కువ కాలంలో పంట చేతికి వచ్చే అపరాలలో పెసర ముఖ్యమైనది. ఈ పంట సాగుతో భూసారం పెరగడంతోపాటు తరువాత వేసే పంటకు నత్రజని అధికంగా లభిస్తుంది. ప్రస్తుతం భూములను దున్ని, సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. ఈ నేపధ్యంలో పెసర సాగుకు అనువైన రకాలు , యాజమాన్యం గురించి తెలుసుకుందాం.
READ ALSO : Multi Cropping In Oil Plam : ఆయిల్ పామ్ లో అంతరపంటగా కోకో, వక్కసాగు
పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద 3 కాలాల్లోను రైతులు సాగుచేస్తున్నారు. ప్రస్తుతం స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయటానికి అత్యంత అనుకూలమైన సమయం. ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా, తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ 15 నుండి జులై 15 వరకు, కృష్ణా , గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో జూన్, జూలై నెలల్లో పెసరను విత్తుకోవచ్చు. పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కాని చౌడు నేలలు మరియు మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు.
ముఖ్యంగా ఖరీప్ కు అధిక దిగుబడులను ఇచ్చే అనువైన పలు రకాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుండి విడుదలైన రకాలు ఎం.జి.జి – 295 రకం పంట కాలం 60 నుండి 65 రోజులు . ఈ మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కాపు మొక్క పైభాగానే ఉండి గింజ మధ్యస్థ లావుగా, సాదాగా ఉంటుంది. ఎకరాకు 5 నుండి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. నల్లమచ్చ తెగులును తట్టుకొంటుంది. మొవ్వుకుళ్లు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.
READ ALSO : Green Manure Cultivation : పచ్చిరొట్ట పైర్లు.. ఉపయోగాలు
మరో రకం డబ్ల్యు.జి.జి-37 . ఈ రకం పంట కాలం కూడా 60 నుండి 65 రోజులు. గింజ ఆకర్షనీయంగా పచ్చగా మొరుస్తుంది. రాష్ట్రమంతటా అన్నికాలల్లో పండించడానికి అనుకూలమైనది. ఎకరాకు 5 నుండి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. ఎల్లో మోజాయిక్ తెగులు తట్టుకుంటుంది.
టి.ఎం – 96-2 పంట కాలం 60 నుండి 65 రోజులు రబీ, వేసవి, మెట్ట , మగాణిల్లో వేసుకోవచ్చు . ఎకరాకు 4 నుండి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. అధిక తేమను , బూడిద తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా మెరుస్తుంటాయి. ముఖ్యంగా వరిమాగాణులకు అనువైన రకం.
యం.జి.జి – 348 . భద్రాద్రి పేరుతో కూడా పిలుస్తారు. ఈ రకం పంట కాలం 65 రోజులు ఖరీఫ్, రబీకి అనువైన రకం .ఎకరాకు 4 నుండి 5 క్వింటాల దిగుబడి వస్తుంది. మొక్క పొట్టిగా ఉండి అంతరపంటకి అనుకూలం. రబీ సాగుకు అత్యంత అనుకూలమైనది. బెట్టను కొంత వరకు తట్టుకుంటుంది.
READ ALSO : Green Gram Cultivation : వేసవి పెసర సాగులో మేలైన యాజమాన్యం…అందుబాటులో అధిక దిగుబడినిచ్చే రకాలు
యం.జి.జి – 347 . మధిర నుండి విడుదలైన ఈ రకం పంట కాలం 65 నుండి 70 రోజులు. ఎకరాకు 4 నుండి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కాయ మొక్కపైభాగాన ఉండి, గింజ లావుగా, సాదాగా ఉంటుంది. మొవ్వుకుళ్లు , ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది.
యం.జి.జి – 42 . ఖరీఫ్, రబీ, వేసవి కాలాలకు అనువైన రకం. ఎకరాకు 4 నుండి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. పొడవైన కాయలు కలిగి, లావు మెరుపు గింజలు ఉంటాయి. పల్లాకు తెగులు తట్టుకుంటుంది. ముఖ్యంగా పత్తిలో అంతర పంటగా అనువైన రకం.
ఆంధ్రప్రదేశ్ నుండి విడుదలైన రకాలు ఎల్. జి. జి -407 . ఈ రకం మూడు కాలల్లోనే సాగుచేసుకోవచ్చు. పంట కాలం 65 నుండి 70 రోజులు . పల్లాకు , నల్ల ,ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. బెట్టను కూడా కొంత వరకు తట్టుకుంటుంది.
READ ALSO : Groundnut Bug And stem Fly : మినుము, పెసర పంటలో శనగపచ్చ పురుగు, కాండపు ఈగ నివారణ!
ఎల్. జి. జి -460. ఈ రకం పంట కాలం కూడా 65 నుండి 70 రోజులు. ఎకరాకు 5 నుండి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. కాయలు గుత్తులు గుత్తులుగా పై భాగాంలో ఉండి కోయడానికి సులువుగా ఉంటుంది. ఒకేసారి కోతకు వస్తుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. మొవ్వుకుళ్లు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. వరి మాగాణులకు అనువైన రకం.
ఎల్. జి. జి -450. ఈ రకం పంట కాలం కూడా 65 నుండి 70 రోజులు. ఎకరాకు 5 నుండి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. కోత సమయంలో వర్షాలు కురిసినా కాయల్లోని గింజలు కొంత వరకు పాడవకుండా ఉంటాయి.
ఎల్. జి. జి -410. ఈ రకం పంట కాలం కూడా 65 నుండి 70 రోజులు. ఎకరాకు 5 నుండి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. ఒకే సారి కోతకు వస్తుంది. వరి మాగణులకు అనువైన రకం.
ఐ.పి.యం – 2-14 . ఈ రకం పంట కాలం కూడా 65 నుండి 70 రోజులు. ఎకరాకు 4 నుండి 6 క్వింటాల దిగుబడి వస్తుంది. మొక్క నిటారుగా పెరిగి ఒకేసారి కోతకు వచ్చే రకం. గింజలు మధ్యస్థ లావుగా మెరుస్తుంటాయి. పల్లాకు తెగులును తట్టుకుంటుంది.
READ ALSO : Groundnut Bug And stem Fly : మినుము, పెసర పంటలో శనగపచ్చ పురుగు, కాండపు ఈగ నివారణ!
పెసర సాగుకు నేల తయారి చాలా ముఖ్యం. ఒక సారినాగలితోను, రెండుసార్లు గొర్రుతోనే మెత్తగా దున్ని గుంటక తోలి నేలను తయారు చేయాలి. వరి కోసిన పొలాల్లో దుక్కిదున్నవలసిన అవసరం లేదు. తొలకరిలో ఎకరాకు విత్తనం 6 నుండి 7 కిలోలు సరిపోతుంది. విత్తనాన్ని విత్తేముందు తప్పని సరిగా విత్తన శుద్ధి చేయాలి. కిలో విత్తనానికి 2.5 గ్రాముల థైరామ్ తో5 మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా5 గ్రాముల థయోమిథాక్సామ్ కలిపి విత్తనశుద్ధి చేసినట్లైతే 15 నుండి 20 రోజుల వరకు తెగుళ్లు, రసం పీల్చే పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు రైజోబియం కల్చరును విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు.
READ ALSO : Pesara Crop : పెసర పంటలో తెగుళ్లు, నివారణ
పెసర వర్షాధారపు పంట. కాని వర్షాభావ పరిస్థితులేర్పడినప్పుడు ఒకటి, రెండు నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. పెసరకు 25 నుండి30 రోజుల దశలో ఒకసారి, 45 నుండి 50 రోజుల దశలో మరోసారి తేలిక పాటి తడులు ఇవ్వాలి. పూత దశలో నీటితడులు ఇవ్వకూడదు.
పెసరసాగులో కలుపు నివారణ కూడా కీలకమే . పెండిమెథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి-1. 6 లీటర్లు లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజుగాని పిచికారి చేయాలి. విత్తిన 20, 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. మాగాణి పెసరలో ఊద నిర్మూలనకు ఫెనాక్సాప్రాప్ ఇథైల్ 9% ఎకరాకు 250 మి.లీ. చొప్పున 200 లీ. నీటిలో కలిపి విత్తిన 20, 25 రోజులప్పుడు పిచికారి చేయాలి. ఊదతో పాటు చిప్పెర గరిక లాంటి గడ్డిజాతి కలుపు ఉంటే క్విజలోఫాఫ్ ఇథైల్ 5 % 400 మిల్లీ లీటర్లు పిచికారి చేయాలి. వెడల్పాకు కలుపు ఉన్నట్లైతే, రెండు ఆకుల దశలో ఎకరాకు ఇమజితాఫిర్ 200 మిల్లీ లీటర్లు పిచికారి చేయాలి.