Home » Green Gram Cultivation Information Guide
పెసరసాగులో కలుపు నివారణ కూడా కీలకమే . పంట మొలకెత్తక ముందు, మొలకెత్తిన తరువాత కలుపు మందులను సిఫారసు మేరకు పిచికారి చేసి నివారించాలి. తద్వారా పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది. సాధారణంగా పెసరను వర్షాధారంగా పండిస్తారు.
పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కాని చౌడు నేలలు మరియు మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దాదాపు 22 వేల ఎకరాలలో రైతులు పెసరను సాగుచేస్తూ ఉంటారు.
పెసర వర్షాధారపు పంట. కాని వర్షాభావ పరిస్థితులేర్పడినప్పుడు ఒకటి, రెండు నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. పెసరకు 25 నుండి30 రోజుల దశలో ఒకసారి, 45 నుండి 50 రోజుల దశలో మరోసారి తేలిక పాటి తడులు ఇవ్వాలి. పూత దశలో నీటితడులు ఇవ్వకూడదు.
స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో చేతికి వచ్చే పంట పెసర. ఈ పంట సాగుతో భూసారం పెరగడంతోపాటు, తరువాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తుంది . సాగు ఆరంభం నుంచే, ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని, సమయానుకూలంగా , యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎక
వేసవి పెసర సాగులో రైతులు సస్యరక్షణ పట్ల అత్యంత మెలకువగా వ్యవహరించాలి. ముఖ్యంగా నాటిన తొలిదశలో పైరుకు చిత్తపురుగుల బెడద ఎక్కువగా వుంటుంది. పైరు రెండాకుల దశలో లేత ఆకులను ఆశించి, రంధ్రాలు చేయటం వల్ల ఆకులు జల్లెడగా మారిపోతాయి.