Green Gram Cultivation : ఖరీఫ్ కు అనువైన పెసర రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కాని చౌడు నేలలు మరియు మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దాదాపు 22 వేల ఎకరాలలో రైతులు పెసరను సాగుచేస్తూ ఉంటారు. 

Green Gram Cultivation : ఖరీఫ్ కు అనువైన పెసర రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

Green Gram Cultivation Techniques

Green Gram Cultivation : తక్కువ పెట్టుబడులతో, స్వల్పకాలంలో అందివచ్చే అపరాలసాగు రైతుకు అన్ని విధాలా కలసివస్తోంది. సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని, సమయానుకూలంగా  యాజమాన్య పద్ధతులు  పాటించినట్లయితే ఎకరాకు 5 నుండి 8 క్వింటాళ్ళ వరకు దిగుబడులు పొందవచ్చు. ప్రస్థుతం వానాకాలం పెసర సాగుచేసే రైతులు  పైరులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత.

READ ALSO : Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద 3 కాలాల్లోను రైతులు సాగుచేస్తున్నారు.  ప్రస్తుతం స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయటానికి అత్యంత అనుకూలమైన సమయం. ఉత్తర తెలంగాణా, దక్షిణ తెలంగాణా, తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ 15 నుండి జులై 15 వరకు, కృష్ణా , గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో జూన్, జూలై నెలల్లో పెసరను విత్తుకోవచ్చు.

READ ALSO : Drip Irrigation System : వ్యవసాయంలో పెరుగుతున్న మైక్రో ఇరిగేషన్ వాడకం !

పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కాని చౌడు నేలలు మరియు మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దాదాపు 22 వేల ఎకరాలలో రైతులు పెసరను సాగుచేస్తూ ఉంటారు.  అయితే రకాల ఎంపిక, మొక్కల మధ్య దూరం పాటించినట్లైతే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత.

READ ALSO : Organic Vegetable Farming : వ్యవసాయం చేస్తూ.. రైతుబజార్లో కూరగాయల అమ్ముతున్న యువజంట

పెసర వర్షాధారపు పంట. కాని వర్షాభావ పరిస్థితులేర్పడినప్పుడు ఒకటి, రెండు నీటి తడులు అందించాలి. ముఖ్యంగా పెసరసాగులో కలుపు నివారణతో పాటు చీడపీడల నివారణ కూడా కీలకం. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.