Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు. 

Mixed Farming : చేపలు, కోళ్లు, పశువులతో.. మిశ్రమ వ్యవసాయం చేస్తున్న రైతు

Mixed Farming

Mixed Farming : ఎండా, వానలను లెక్కచేయకుండా ఆరుగాలం శ్రమించే రైతన్న.. కష్టానికి తగిన ఆదాయం పొందాలంటే.. సాగులో వినూత్న పద్దతులు అవలంబించాలి. ఒకే పంటకు పరిమితం కాకుండా ఉన్న భూమిలో సమీకృత వ్యవసాయం విధానంలో  వీలైనన్ని ఎక్కువ పంటలు పండించాలి. ఈ పద్ధతికి సహజ సేద్యం విధానాలను జోడిస్తే… పెట్టుబడి తగ్గి లాభాలు దక్కుతాయి.  నిర్మల్ జిల్లా, దిలావార్పూర్ మండలం  బన్సపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ఇదే మార్గంలో సాగుతున్నారు. లాభసాటి వ్యవసాయ విధానాలతో తోటి రైతులకు మార్గదర్శిగా నిలుస్తున్నారు.

READ ALSO : Animal Diseases : వర్షాకాలంలో జీవాలకు ఆశించే వ్యాధులు నివారణ చర్యలు

తల్లి భూదేవి చల్లగా చూస్తే అన్నం ముద్దకు కరువే లేదని రైతు ఆత్మవిశ్వాసంతో ప్రకటించేవాడు. ఇది గతం..  ఇప్పుడు నాలుగెదైకరాలున్న సన్నకారు రైతుల నుంచి పదుల ఎకరాల మోతుబరులు కూడా సాగులో తగిలిన దెబ్బలకు నవనాడులు కుంగిపోయి, జవసత్వాలు కూడగట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. వ్యవసాయం వ్యాపార పరమార్థమయ్యాక పరిస్థితి మారింది. ఒక వైపు వ్యాపారుల మాయాజాలం, మరో వైపు పగబట్టి ప్రకృతి కొట్టిన దెబ్బలకు కుంగిపోతున్నారు.

లాభాల సంగతి దేవుడెరుగు బతుకు గడిస్తే చాలనుకునేటట్లు మిగిలారు. మరోవైపు మన్ను నుంచి అన్నం తీసిన చేతులు మట్టి పనులు చేయడానికి వలసబాట పడుతున్నాయి. మార్కెట్ లక్ష్యంగా సాగు మొదలు పెట్టిన నాటి నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల నుండి గట్టెక్కాలంటే మిశ్రమ వ్యవసాయమే మార్గమంటున్నారు  నిర్మల్ జిల్లా, దిలావార్పూర్ మండలం  బన్సపల్లి గ్రామానికి చెందిన  రైతు కృష్ణ ప్రసాద్ .

READ ALSO : Cultivation Of Marigolds : కొబ్బరిలో అంతర పంటగా బంతిపూల సాగు

ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రమే రైతు కృష్ణ ప్రసాద్ ది. మొత్తం 4 ఎకరాలు. అందులో ఎకరంలో వరిసాగు, అర ఎకరంలో మొక్కజొన్న సాగుచేస్తూనే.. అర ఎకరంలో చేపల చెరువు తవ్వించారు. మరో ముప్పావు ఎకరంలో కోళ్లషెడ్ ఏర్పాటు చేసి కడక్ నాథ్, గిన్నీకోళ్లతో పాటు బాతులను పెంచుతున్నారు. అర ఎకరంలో పాడి పశువులను పెంచుతున్నారు. పశువులు, కోళ్లనుండి వచ్చే వ్యర్థాలను పంటలకు అందిస్తున్నారు. పంటల నుండి వచ్చే వ్యర్థాలను పశువులకు, కోళ్లకు మేతగా వాడుతూ.. పెట్టుబడులు తగ్గించుకుంటూ.. నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు.

READ ALSO : Benda Cultivation : ప్రకృతి విధానంలో బెండ సాగు.. ఎకరాకు 2 లక్షల నిరకర ఆదాయం

ఒకప్పుడు  రైతులందరూ పంటలతో పాటు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశుసంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతే కాకుండా ఒకే పంటను సాగుచేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు.  మారుతున్న కాలానుగుణంగా   వ్యవసాయం  అనుబంధ రంగాలను ఎన్నుకొని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు , వ్వర్ధాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడుతాయి.