పళ్ళ మధ్య పగుళ్లు వస్తున్నాయా.. పళ్ళు మొత్తం పుచ్చిపోయే ప్రమాదం ఉంది.. ఈ జాగ్రత్తలు అవసరం
పళ్ళ మధ్య పగుళ్లు లేదా గ్యాపులు (Tooth Cracks or Gaps) ఏర్పడటం ఒకటి. ఇవి కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ రూపంలో బయటపడతాయి.

Preventive measures to prevent cracks between teeth
పళ్ళ ఆరోగ్యం అనేది మన ఆరోగ్యానికి ప్రతిబింబంగా చెప్పుకోవచ్చు. అవి ఎంత ఆరోగ్యంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుందని అర్థం. అందుకే పళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. అందుకోసం పళ్లను శుభ్రం చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే, కొంతమంది మాత్రం పళ్ళ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటిలో పళ్ళ మధ్య పగుళ్లు లేదా గ్యాపులు (Tooth Cracks or Gaps) ఏర్పడటం ఒకటి. ఇవి కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ రూపంలో బయటపడతాయి. ఇది రాను రాను పళ్ళు మొత్తం పుచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, పళ్ళ విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. మరి ఆ విషయాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
పళ్ళ మధ్య పగుళ్లు రావడానికి ముఖ్య కారణాలు:
బలంగా పదార్థాలు కొరకడం / గట్టి ఆహారం తినడం:
బలమైన పదార్థాలను కొరకడం, తినడం వల్ల పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే మంచు ముక్కలు, గట్టి కారం, బాదం, పాకం వంటి వాటిని ఎక్కువగా కొరికి తినడం వల్ల పల్లులో ఒత్తిడి పెరిగి పగుళ్లు ఏర్పడతాయి.
ఆకస్మాత్తుగా వేడి/ చల్లదన పదార్థాలు తినడం:
వేడి టీ లేదా నీరు తాగిన వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కూడా పళ్ళలో ఉష్ణోగ్రత మార్పులు ఏర్పడి పగుళ్లు రావచ్చు.
వయసుతో పాటు వచ్చే బలహీనత:
వృద్ధాప్యంలో దంతాల బలహీనంగా మారతాయి. దీనివల్ల చిన్న చిన్న చీలికలు ఏర్పడే పెద్ద సమస్యలు కావచ్చు.
జన్యుపరమైన లక్షణాలు:
కొందరికి పుట్టుకతోనే ఎమెల్ బలహీనంగా ఉండడం వల్ల పగుళ్లు సులభంగా వస్తాయి.
నివారణ చర్యలు:
1.గట్టి ఆహారాలనుంచి జాగ్రత్త:
గట్టిగా ఉండే పదార్థాలన తినడం తగ్గించాలి. ఆహారాన్ని మృదువుగా కొరుకుతూ తినాలి.
2.వేడిగా, చల్లగా తినే అలవాట్లపై నియంత్రణ:
వేడి పదార్థాలు తిన్న వెంటనే చల్లగా తినకూడదు. ఉష్ణోగ్రత తేడా పెద్దగా ఉండే ఆహారాలను ఒకేసారి తినకూడదు.
3.బ్రషింగ్ అలవాటు:
రోజుకు రెండుసార్లు సాఫ్ట్ బ్రిస్టిల్ బ్రష్‌తో బ్రష్ చేసుకోవాలి. ఫ్లోస్ వాడటం వల్ల పళ్ళ బలహీనతలు రాకుండా చూసుకోవచ్చు
4.నీరు తాగడం, నోటి శుభ్రత:
నోటిలో ఆమ్లత తగ్గించడానికి, బ్యాక్టీరియా వృద్ధిని నిరోధించేందుకు నీరు తాగడం చాలా అవసరం.
చికిత్సా మార్గాలు:
బాండింగ్: చిన్న పగుళ్లను రెజిన్‌తో పూసి కవరింగ్ చేయడం
క్రౌన్: బలహీనమైన పల్లును మెటల్ లేదా పోర్సలిన్ క్రౌన్‌తో కప్పడం
రూట్ కనాల్ ట్రీట్మెంట్: పల్లులో నరాల వరకు పగుళ్లు వెళ్ళినప్పుడు దీన్ని చేస్తారు
ఎక్స్ట్రాక్షన్: బాగా పగిలిపోయి కాపాడలేనిది అయితే పల్లును తీసేయాల్సిన పరిస్థితి
పళ్ళ మధ్య పగుళ్లు చిన్న సమస్యగా కనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేస్తే పెరిగిన నొప్పి, ఇన్ఫెక్షన్ ఖరీదైన చికిత్సలకు దారి తీస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు డెంటల్ చెకప్‌లు చేయించుకోవడం, మంచి అలవాట్లు పాటించడం అత్యంత అవసరం.