వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు.. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు
వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. పరిగి పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున 3.47గంటలకు మూడు సెకన్ల పాటు భూమి కపించింది.

earthquakes
Earthquakes: వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది (Earthquake). పరిగి పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున 3.47గంటలకు మూడు సెకన్ల పాటు భూమి కపించింది. రంగాపూర్, బసిరెడ్డిపల్లి, న్యామత్ నగర్‌లో భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే భూకంప తీవ్రత ఎంత.. తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
ఓవైపు జోరుగా వర్షం కురుస్తుండగా.. మరోవైపు భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గతంలో కూడా వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 2024 ఫిబ్రవరిలో వికారాబాద్ జిల్లాలో 2.5 తీవ్రతతో స్వల్ప భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నిర్ధారించింది. 2022లో కూడా జిల్లాలోని పరిగి మండలంలో భూమి కంపించింది.