Home » Pomegranate Cultivation
చలికాలంలో చల్లగాను ఎండాకాలంలో వేడిగా ఉండే ప్రాంతాల్లో దానిమ్మసాగు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల వాతావరణ పరిస్ధితులను తట్టుకుంటుంది. క్షారత ఎక్కువగా ఉన్న భూముల్లో దానిమ్మ పంటను సాగు చేసి అధిక దిగుబడులను పొందవచ్చు.
ఏ సీజన్లో పంట తీసుకోవాలి, ఏ సమయంలో అధిక రేటు లభిస్తుందో నీటి సదుపాయం, భూమి లక్షణాలు, పురుగులు మరియు తెగుళ్ళు వలన కలిగే నష్టం మరియు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించుకోవాలి. బాక్టీరియా తెగులు వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది.
జనవరి ఫిబ్రవరి మాసాలలో పూతనిచ్చే హస్తబహార్ కాపుకోసం జూన్ నెలనుండి నీటి తడులివ్వడం ఆపాలి. జూన్ నెలలో వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఈ పంట తీయడం కొంచెం కష్టంతోకూడుకున్నది.