Pomegranate Cultivation : దానిమ్మ సాగులో అధిక దిగుబడినిచ్చే రకాలు !

చలికాలంలో చల్లగాను ఎండాకాలంలో వేడిగా ఉండే ప్రాంతాల్లో దానిమ్మసాగు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల వాతావరణ పరిస్ధితులను తట్టుకుంటుంది. క్షారత ఎక్కువగా ఉన్న భూముల్లో దానిమ్మ పంటను సాగు చేసి అధిక దిగుబడులను పొందవచ్చు.

Pomegranate Cultivation : దానిమ్మ సాగులో అధిక దిగుబడినిచ్చే రకాలు !

Pomegranate

Pomegranate Cultivation : దానిమ్మ సాగులో భారత దేశం అగ్రస్ధానంలో ఉంది. పోషకాలు కలిగి ఉండే ఈ అద్భుతమైన పండు, పువ్వులు, ఆకులను వివిధ ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు. దానిమ్మ సాగును ఎక్కువగా మహారాష్ట్ర రైతులు చేపడుతుండగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు.

READ ALSO : Harvesting Honey : ఏడాదికి రూ. 5 లక్షల నికర ఆదాయం.. స్వయం ఉపాధిగా తేనెటీగల పెంపకం

ఇది ఊష్ణ మండల పంట. చలికాలంలో చల్లగాను ఎండాకాలంలో వేడిగా ఉండే ప్రాంతాల్లో దానిమ్మసాగు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల వాతావరణ పరిస్ధితులను తట్టుకుంటుంది. క్షారత ఎక్కువగా ఉన్న భూముల్లో దానిమ్మ పంటను సాగు చేసి అధిక దిగుబడులను పొందవచ్చు. అధిక దిగుబడి , చీడపీడల బారిన పడకుండా ఉండే విత్తన రకాలను రైతులు ఎంచుకోవాలి. దానిమ్మ సాగు చేపట్టే రైతులు అధిక దిగుబడి కోసం ఎంచుకోవాల్సిన రకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దానిమ్మ సాగుకు అనువైన రకాలు ;

మస్కత్:

ఈ రకం దానిమ్మ పండ్లు గులాబీ రంగు గింజలను కలిగి ఉంటాయి. పై భాగంఎరుపు రంగును కలిగి ఉంటుంది. పండు సగటు బరువు 300 నుండి 350 గ్రాములు ఉంటుంది.

READ ALSO : Andra Pradesh Govt : విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలకు కేటాయిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు

జ్యోతి :

ఐఐహెచ్‌ఆర్‌(IIHR) బెంగళూరు ఈ రకాన్ని అభివృద్ధి చేసింది. పండ్లు పెద్దగా, ముదురు రంగుతో ఆకర్షణీయంగా ఉండి విత్తనాలు అధిక రసంతో చాలా మృదువుగా ఉంటాయి. ఈ రకంలోని పండ్లు చెట్ల కొమ్మల మధ్య ఉండటం వలన ఎండని తట్టుకోగలవు.

రూబీ:

దీనిని బెంగళూరులోని IIHR అభివృద్ధి చేసింది. ఈ రకంలో పై తొక్క ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది. ఎరుపు రంగును కలిగి ఆకుపచ్చ గీతలు ఉంటాయి. పండు 270 గ్రా బరువు ఉంటుంది, సగటున హెక్టారుకు 16-18 టన్నులు దిగుబడి వస్తుంది.

READ ALSO : Prevent Pests In Cotton : పత్తిలో చీడపీడలు నివారించేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

గణేష్:

దానిమ్మ పండ్లు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉంటాయి. వీటి తొక్క ఎరుపు, పసుపు రంగు మిశ్రమంలో ఉంటుంది. గింజలు మృదువుగా గులాబీ రంగు లో ఉంటాయి. మహారాష్ట్ర లో వాణిజ్యశైలి సాగు చేస్తున్నారు. ఒక చెట్టు నుండి సగటు దిగుబడి 8-10 కిలోలు వస్తుంది.

అరక్త :

ఈ రకం దానిమ్మ పండ్లు గణేష్ రకం కంటే చిన్నవిగా ఉండి మృదువైన గింజలతో ముదురు ఎరుపు రంగులో ఉంటాయి.

READ ALSO : Pests In Onion : ఉల్లిసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

మృదుల:

ఈ రకం దానిమ్మలో గింజలు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. గణేష్ రకం లక్షణాలు కలిగి ఉంటుంది. బహార్ సగటున ఒక్కో పండు బరువు 250 నుండి 300 గ్రాముల వరకు బరువు ఉంటుంది.

ధోల్కా:

ఈ దానిమ్మ పండ్లు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉంటాయి. ఈ రకాన్ని గుజరాత్‌ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు.