Andra Pradesh Govt : విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించే పక్రియలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Andra Pradesh Govt : విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

AP Govt Allot Buildings for Govt Dept

AP Govt orders : విశాఖలో పరిపాలన దిశగా ఏపీ సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలను కేటాయించింది. దీనికి సంబంధించి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, ఉన్నతాధికారులు, ఆయా శాఖల కార్యదర్శలకు భవనాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ శాఖలకు భవనాలను కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్యాలయ, విడిది అవసరాలకు భవనాల కేటాయింపులు జరిగాయని.. 35 శాఖలకు కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు సూచించింది. మిలీనియం టవర్స్ లోని ఏ, బీ బ్లాక్ భవనాలు, ఆంధ్రా యూనివర్శిటీ, రుషి కొండ, చినగదిలి, ఎండాడ తదితర ప్రాంతాల్లో భవనాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2.27 లక్షల చదరపు అడుగుల విస్త్రీర్ణంలో ఈ భవనాలు ఉండనున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇక విశాఖ నుంచే పరిపాలన అనే అంశంలో ఇది కీలక పరిణామం అనే చెప్పాలి. విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్‌ కార్యాలయాలను కమిటీ గుర్తించింది. సీఎం, మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగంపై కమిటీ(ఆర్థిక శాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ కార్యదర్శి) నివేదిక మేరకు సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలన్నారు.

Also Read : వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

సీఎం, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లినప్పుడు ఉపయోగించేందుకు మిలినియం టవర్స్‌లో ఏ, బీ టవర్స్‌ను కేటాయించారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం సీఎం, మంత్రుల పర్యటనల సమయంలో వినియోగించేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలినియం టవర్స్‌ను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు. మిలినియం టవర్స్‌లో లక్ష 75 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పెస్‌ను గుర్తించారు.