CM Jagan : వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి, గౌరవప్రదంగా పెళ్లిళ్లు చేసి, వివాహ జీవితాలను మొదలు పెట్టించే కార్యక్రమంలో సాయంగా ఉండే ఒక మంచి కార్యక్రమం అని అన్నారు.

CM Jagan : వైఎస్ఆర్  కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

CM Jagan released funds

CM Jagan Released Funds : ఏపీలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులు విడుదల అయ్యాయి. క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ నిధుల విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి, గౌరవప్రదంగా పెళ్లిళ్లు చేసి, వివాహ జీవితాలను మొదలు పెట్టించే కార్యక్రమంలో సాయంగా ఉండే ఒక మంచి కార్యక్రమం అని అన్నారు.

పేద వర్గాలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికులు అందరినీ ప్రతి సందర్భంలో నా వాళ్లు అంటూ వారి మీద ఓనర్ షిప్ తీసుకుంటూ, ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన వాళ్లు అంటూ భరోసా ఇస్తూ, చేయి పట్టుకుని నడిపిస్తున్నామని తెలిపారు. ఈరోజు ఈ పథకం ద్వారా జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన పెళ్లిళ్లకు సంబంధించి 10,511 మంది జంటలకు 81.64 లక్షల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని తెలిపారు.

Vivek Venkataswamy : కేసీఆర్ అమిత్ షాకు ఫోన్ చేసి ఐటీ, ఈడీ రెయిడ్స్ చేయించాడు : వివేక్ వెంకటస్వామి

ఈ పథకంలో ఇప్పటివరకు మూడు త్రైమాసికాల్లో మూడు విడతల్లో ఈ ఆర్థిక సాయం అందించామని చెప్పారు. 2022 అక్టోబర్ నుంచి మొదలు పెడితే ఇవాళ్టికి ఈరోజు ఇస్తున్న నాలుగో విడతతో కలిపి 46,062 జంటలకు రూ.349 కోట్లు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఎలా ఉండేదని బేరీజు వేసుకుంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తుందని తెలిపారు.

గత ప్రభుత్వం ఏనాడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో పథకాలు తీసుకురావాలని పేదవాళ్లకు మంచి జరగాలని అడుగులు పడలేదని విమర్శించారు. ఆ ఉద్దేశం, సంకల్పం మంచిదైతే దేవుడు ఆ సంకల్పాన్ని ఆశీర్వదిస్తాడని, పరిస్థితులు అన్ని రకాలుగా కలిసి వస్తాయన్నారు. అటువంటి మంచి సంకల్పంతో అడుగులు ముందుకు వేసిందే ఈ పథకం అన్నారు. ఈ పథకం ప్రకటించేటప్పుడు ఎందుకు పదో తరగతి సర్టిఫికెట్, 18 సంవత్సరాలు తప్పని సరి అని తనతో చాలా మంది అన్నారు.

Vijayawada Indrakiladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా స్వీకరణ ప్రారంభం.. నేటి నుంచి ఐదు రోజుల పాటు

లీడర్లుగా ఉన్నప్పుడు సంకల్పం, విజన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని తెలిపారు. పదో తరగతి సర్టిఫికెట్, 18 ఏళ్లు వధువుకు, 21 ఏళ్లు వరుడికి ఉండాలని చెబుతామో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గేలా అడుగులు వేశామని తెలిపారు. రెండోది పదో తరగతి సర్టిఫికెట్ తప్పనిసరి చేయడం వల్ల ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించేందుకు మరింత ఊతం ఇస్తుందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం బడుల రూపురేఖలు మారుతున్నాయని ఇంగ్లీషు మీడియం చదువులు వచ్చాయని తెలిపారు.

ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధన, ఐఎఫ్‌పీల బోధన, 3వ తరగతి నుంచి సబ్జెట్ టీచర్, 8వ తరగతి వాళ్లకు ట్యాబ్స్, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ తో పిల్లలు బాగా ఎదగాలని అడుగులు వేస్తున్నామని తెలిపారు. తల్లులను మోటివేట్ చేస్తూ అమ్మ ఒడి తీసుకొచ్చామని వెల్లడించారు. తమ పిల్లలను బడులకు పంపేలా మోటివేట్ అవుతున్నారని తెలిపారు. పదో తరగతి సర్టిఫికెట్ తప్పనిసరి చేయడం వల్ల కచ్చితంగా పదో తరగతి వరకు చదువుతారని పేర్కొన్నారు.

KTR : పండిన ప్రతి గింజను కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి కేటీఆర్

18 సంవత్సరాల వరకు ఆగాలి కనుక ఇంటర్ దాకా అమ్మ ఒడి వర్తిస్తుంది కాబట్టి ఇంటర్ చదివిస్తారని తెలిపారు. తల్లిదండ్రులకు నష్టం లేదని అమ్మ ఒడి ద్వారా ఆదాయం వస్తుందన్నారు. ఇంటర్ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన అందుబాటులో ఉన్నాయన్నది మెదడుకు తడుతుందని తెలిపారు. పూర్తి ఫీజు అందుతుందని, అప్పుడు పిల్లలను చదివించగలమని భావిస్తారని పేర్కొన్నారు. వసతి దీవెన కింద రూ.20 వేల వరకు సంవత్సరానికి వస్తాయని తడుతుందన్నారు.

పిల్లలను గ్రాడ్యుయేషన్ వరకు చదివించేందుకు మోటివేట్ అవుతారని తెలిపారు. చదువులన్నది గ్రాడ్యుయేట్స్ అయ్యే దాకా పిల్లల దగ్గరికి తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇలా చదివించగలగడం వల్ల జనరేషన్ చేంజ్ అవుతుందని చెప్పారు. చదువు అనే అస్త్రంతో పిల్లల తలరాతలు మార్చే గొప్ప వ్యవస్థ ఏర్పడుతుందన్నారు. వీటన్నింటినీ మనసులో పెట్టుకొని ఈ పథకం తీసుకొచ్చామని తెలిపారు. గత ప్రభుత్వంలో పదో తరగతి ఇన్‌సిస్ట్ చేసే పరిస్థితి లేదని 2018కి పథకమే పక్కన పడేశారని పేర్కొన్నారు.

Mayawat : అధికారంలోకి రాగానే నిరుపేదలకు భూ పంపిణీ : మాయావతి

ఇంత మంది విద్యార్థులకు ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ లేదు, ఎప్పుడిస్తారో తెలియదన్నారు. ఎక్కడా మోటివేషన్, చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈరోజు మనం చిత్తశుద్ధి, మోటివేషన్, పారదర్శకత ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్, మరుసటి నెల కళ్యాణమస్తు, షాదీ తోఫా తల్లుల ఖాతాల్లో జమ చేసే పద్ధతి తీసుకొచ్చామని తెలిపారు. గతంలో మైనార్టీలకు రూ.50 వేలు మాత్రమే ఇచ్చే వారని అది కూడా కొంత మందికే ఇచ్చారని, అది కూడా ఎప్పుడిస్తారో తెలియదన్నారు.

ఈ ప్రభుత్వం మైనార్టీలకు ఏకంగా లక్ష రూపాయలు ఇస్తుందని, అది కూడా పదో తరగతి పాస్ అయ్యుండాలని చెబుతున్నామని తెలిపారు. ఈ విధంగా చదువులను ప్రోత్సహించడం కోసం, తల్లిదండ్రులంతా పిల్లల్ని చదివించే దిశగా అడుగులు వేయించేలా చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమం ఇంకా ప్రజల్లోకి వెళ్లే కొద్దీ చాలా మందికి మోటివేషన్ దిశగా అడుగులు వేయించాలని తపన, తాపత్రయంతో ముందుకు అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి దేవుడు ఎప్పుడూ ఆశీర్వదించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.

Pawan Kalyan : సనాతన ధర్మం, సోషలిజం రెండు కలిసి నడిచేదే జనసేన : పవన్ కల్యాణ్

కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద ఇప్పుడు 10,511 జంటలకు ఇస్తున్న వారిలో 8042 మందికి అమ్మ ఒడి లేదా జగనన్న విద్యా దీవెన లేదా జగనన్న వసతి దీవెన కింద ప్రయోజనాలు అందాయన్న విషయం చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. ఇది గొప్ప మార్పుకు చిహ్నంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో, రాబోయే నెలల్లో, రాబోయే సంవత్సరాల్లో 100 శాతం కింద రిజిస్టర్ కావాలని తపన, తాపత్రయ పడుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.