Vivek Venkataswamy : కేసీఆర్ అమిత్ షాకు ఫోన్ చేసి ఐటీ, ఈడీ రెయిడ్స్ చేయించాడు : వివేక్ వెంకటస్వామి

హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో హార్డ్ వర్క్ చేసి అభ్యర్థుల గెలుపుకు కృషి చేశానని చెప్పారు. 2014 ఎన్నికల్లో తాను కేసీఆర్ కు సహాయం చేశానని గుర్తు చేశారు.

Vivek Venkataswamy : కేసీఆర్ అమిత్ షాకు ఫోన్ చేసి ఐటీ, ఈడీ రెయిడ్స్ చేయించాడు : వివేక్ వెంకటస్వామి

Vivek Venkataswamy (3)

Vivek Venkataswamy – KCR : బాల్క సుమన్ చెప్పడంతోనే కేసీఆర్ అమిత్ షాకు ఫోన్ చేసి ఐటీ, ఈడీ రెయిడ్ చేయించాడని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. 8 ప్రాంతాల్లో తనిఖీలు చేశారని, అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలిపారు. బాల్క సుమన్ కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. బీజేపీలో ఉన్న సమయంలో పార్టీ కోసం తాను ఎంతో హార్డ్ వర్క్ చేశానని తెలిపారు.

హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో హార్డ్ వర్క్ చేసి అభ్యర్థుల గెలుపుకు కృషి చేశానని చెప్పారు. 2014 ఎన్నికల్లో తాను కేసీఆర్ కు సహాయం చేశానని గుర్తు చేశారు. చట్టం ప్రకారం ఉన్న కాబట్టే కేసీఆర్ పై నాలుగు సంవత్సరాలు నిరంతరం పోరాటం చేస్తున్నానని తెలిపారు. బీజేపీ, కేసీఆర్ ఒక్కటేనని అందుకే కాంగ్రెస్ లోకి వచ్చానని స్పష్టం చేశారు.

Buggana Rajendranath : అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు? : మంత్రి బుగ్గన

తమ సంస్థల్లో జరిగే ప్రతి లావాదేవీలు చట్టం ప్రకారం జరుగుతాయని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ భూములకు సంబంధించి రూ.27 కోట్లు ఇచ్చానని అవన్నీ చట్టం ప్రకారమే చెక్స్ ఇచ్చానని తెలిపారు. ఈటల భూముల కోసమే రూ.27 కోట్లు ఇచ్చానని తెలిపారు.

ఆ భూముల వ్యవహారంలో తనకు ఇప్పుడు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నాడనే ఆయనకు ఎలాంటి నోటిసులు ఇవ్వడం లేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తప్పుడు ఆరోపణలతో తనను అరెస్ట్ చేయాలని కుట్ర చేస్తున్నాయని పేర్కొన్నారు.