KTR : పండిన ప్రతి గింజను కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి కేటీఆర్

రైతు బంధు సమితులు, వేదికలను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం వల్లే తెలంగాణ.. భారతదేశంలో నెంబర్ వన్ గా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 5 రకాల విప్లవాలు విస్తరించి ఉన్నాయని తెలిపారు.

KTR : పండిన ప్రతి గింజను కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి కేటీఆర్

KTR

Minister KTR : కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వికారాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, సూర్యాపేటలను ఎన్నో ఏళ్లుగా జిల్లాలు చేయాలని డిమాండ్ ఉండేదని, అది తెలంగాణ రాష్ట్రం వచ్చాక నెరవేరిందన్నారు. 2014లో పేదరికం 13.18 శాతం ఉండేది కానీ, 2023 వచ్చేసరికి పేదరికం 5.8 శాతానికి తగ్గిందన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తలసరి ఆదాయం 1,24,104 ఉండేదని అదే 2023 వచ్చేసరికి 3, 17, 115 వరకు పెరిగిందని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణలో ఉద్యమం జరిగిందని వెల్లడించారు.

తెలంగాణ అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లైంది అనే విధంగా రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందుందన్నారు. గతంలో తాగునీరు లేక ఎంతో ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తామని కేసీఆర్ చెప్పారు.. చెప్పిన విధంగానే మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. గతంలో కుంటలు, చెరువులు పూర్తిగా ఎండిపోయి ఉండేవన్నారు.

CM Jagan : వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులు విడుదల చేసిన సీఎం జగన్

ఎండిపోయిన చెరువులు, కుంగి పోయిన కుంటలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటితో జలకాలడుతున్నాయని వెల్లడించారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలో సాగునీటి కోసం ఎంతో కొట్లాడినామని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్షా డెబ్భై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం , పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించుకున్నామని తెలిపారు. తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్లలో విద్యా రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు.

గతంలో చెట్ల కింద చదువుకున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వైద్యానికి సంబంధించి రోగమొస్తే ప్రభుత్వ ఆసుపత్రి అంటే కొంత భయముండేది కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిపై పూర్తి నమ్మకం ఏర్పడిందన్నారు. ప్రజలలో అన్ని వసతులతో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నీతి ఆయోగ్ లో ఆరోగ్య సూచికలో మనం ముందు ఉన్నామని తెలిపారు.

Vivek Venkataswamy : కేసీఆర్ అమిత్ షాకు ఫోన్ చేసి ఐటీ, ఈడీ రెయిడ్స్ చేయించాడు : వివేక్ వెంకటస్వామి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గాయని పార్లమెంట్ లో అన్నారని గుర్తు చేశారు. ఇందుకు కారణం 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు రైతు బంధు ద్వారా 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు అందించామని తెలిపారు. రైతు బీమా కింద 5 లక్షల రూపాయల ఉచిత జీవిత బీమా ఇస్తున్నామని పేర్కొన్నారు. పండిన ప్రతి గింజను కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.

రైతు బంధు సమితులు, వేదికలను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం వల్లే తెలంగాణ.. భారతదేశంలో నెంబర్ వన్ గా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 5 రకాల విప్లవాలు విస్తరించి ఉన్నాయని తెలిపారు. అవి హరిత విప్లవం, శ్వేత విప్లవం, పింక్ విప్లవం, నీటి విప్లవం, పసుపు విప్లవమని పేర్కొన్నారు.