Vijayawada Indrakiladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా స్వీకరణ ప్రారంభం.. నేటి నుంచి ఐదు రోజుల పాటు
ఇంద్రకీలాద్రిపై అర్చకులు, గురు భవానీల సమక్షంలో భవానీలు 41 రోజుల దీక్షను స్వీకరిస్తున్నారు. డిసెంబరు 13 నుంచి 17 వరకు 21 రోజుల అర్ధమండల దీక్ష స్వీకరణ ఉంటుంది.

Indrakiladri Durgamma Temple
Vijayawada Indrakiladri – Bhavani Diksha : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా భవానీ దీక్షా స్వీకరణలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదు రోజుల పాటు దుర్గమ్మ మండల దీక్షను భవానీలు స్వీకరించనున్నారు. ఇంద్రకీలాద్రిపై అర్చకులు, గురు భవానీల సమక్షంలో భవానీలు 41 రోజుల దీక్షను స్వీకరిస్తున్నారు.
డిసెంబరు 13 నుంచి 17 వరకు 21 రోజుల అర్ధమండల దీక్ష స్వీకరణ ఉంటుంది. జనవరి 3 నుంచి 7 వరకు భవానీ దీక్షా విరమణలు ఉంటాయి. దుర్గమ్మ దర్శనార్ధం ఇంద్రకీలాద్రిపైకి భవానీలు తరలివస్తున్నారు. భవానీల రద్దీతో ఇంద్రకీలాద్రీ కిటకిటలాడుతోంది.