Karnati Rambabu : దసరా నవరాత్రులకు 15 లక్షల మంది భక్తులు.. రూ.14.71 కోట్ల ఆదాయం : దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు

లడ్డు ప్రసాదాలు 15,05,638 అమ్మకం జరిగాయని తెలిపారు. రూ.3.75 కోట్లు లడ్డు ప్రసాదం ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

Karnati Rambabu : దసరా నవరాత్రులకు 15 లక్షల మంది భక్తులు.. రూ.14.71 కోట్ల ఆదాయం : దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు

Karnati Rambabu

Durgagudi Chairman Karnati Rambabu : ఎక్కడా లోటుపాట్లు లేకుండా సకల సౌకర్యాలతో దసరా నవరాత్రులు నిర్వహించామని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. దసరా నవరాత్రుల్లో అన్ని డిపార్ట్ మెంట్ల సిబ్బంది అద్భుతంగా పనిచేసారని కొనియాడారు. సీఎం జగన్ సూచనల మేరకు ఈ సంవత్సరం గతం కంటే మెరుగ్గా దసరా నిర్వహించామని వెల్లడించారు. అనధికార వీఐపీలను కంట్రోల్ చేస్తూ దసరా నిర్వహించామని తెలిపారు.

దసరా నవరాత్రులకు 12 లక్షల, 2వేల 678 మంది భక్తులు వచ్చినట్టుగా సాంకేతికంగా గుర్తించామని పేర్కొన్నారు. దాదాపు 15 లక్షల మంది భక్తులు దసరాకు వచ్చి ఉండచ్చన్నారు. లడ్డు ప్రసాదాలు 15,05,638 అమ్మకం జరిగాయని తెలిపారు. రూ.3.75 కోట్లు లడ్డు ప్రసాదం ఆదాయం వచ్చిందని వెల్లడించారు. 14 నవంబరు నుంచీ 12 డిసెంబరు వరకూ కార్తీక మాసంలో భవానీలు వస్తారని పేర్కొన్నారు.

Sreeleela : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భగవంత్ కేసరి టీం.. పట్టుచీరలో శ్రీలీల ఎంత పద్దతిగా ఉందో చూడండి..

కార్తీక శుద్ధ విదియ నాడు గాజుల అలంకారం ఉంటుందని తెలిపారు. నవంవర్ 23 నుంచి నవంబర్ 27 వరకూ మండల దీక్షలు ప్రారంభిస్తారని తెలిపారు. డిసెంబర్ 11 నుంచి నవంబర్17 వరకూ అర్ధమండల దీక్షలు ఉంటాయని చెప్పారు. జనవరి 3 నుంచి 7 వరకూ దీక్షల విరమణ కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. డిసెంబర్ 26వ తేదీన పూర్ణిమ సందర్భంగా కలశజ్యోతి కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

దసరాలో రూ.14.71 కోట్ల ఆదాయం : కె.ఎస్.రామారావు
నవమి, దశమి ఒకేరోజు రావడంతో తొమ్మిది రోజులే దసరా నిర్వహించామని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయ ఈఓ కె.ఎస్.రామారావు తెలిపారు. ఆదాయం కంటే భక్తుల సంతృప్తి మాత్రమే ప్రధానంగా తీసుకున్నామని పేర్కొన్నారు. అర్చకసభ నిర్వహించే కీర్తి ఇంద్రకీలాద్రికే దక్కుతుందన్నారు. తెప్పోత్సవం కూడా ఎంతో గొప్పగా జరిగిందని చెప్పారు. దసరాలో రూ.14.71 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గత సంవత్సరం కంటే ఒకరోజు తక్కువగా చేసినా ఆదాయం ఎక్కువే వచ్చిందని తెలిపారు.