Sreeleela : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భగవంత్ కేసరి టీం.. పట్టుచీరలో శ్రీలీల ఎంత పద్దతిగా ఉందో చూడండి..

భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం చిత్రయూనిట్ సక్సెస్ టూర్ చేస్తున్నారు.

Sreeleela : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భగవంత్ కేసరి టీం.. పట్టుచీరలో శ్రీలీల ఎంత పద్దతిగా ఉందో చూడండి..

Sreeleela and Bhagavanth Kesari Movie Team in Vijayawada Kanakadurga Temple

Sreeleela : అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో బాలయ్య(Balayya) హీరోగా ఇటీవల దసరాకు వచ్చిన భగవంత్ కేసరి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఈ సినిమాలో బాలయ్య మాస్ తో పాటు మంచి మెసేజ్, ఎమోషన్ ఉండటంతో సినిమా మరింత ఎక్కువమందికి రీచ్ అవుతుంది. సినిమా మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం చిత్రయూనిట్ సక్సెస్ టూర్ చేస్తున్నారు.

ఈ సక్సెస్ టూర్ లో అనిల్ రావిపూడి, శ్రీలీల, నిర్మాతలు సాహు, హరీష్, పలువురు చిత్రయూనిట్ వెళ్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఈ టూర్ జరుగుతుంది. ఇప్పటికే వైజాగ్, ఏలూరు, రాజమండ్రి థియేటర్స్ కి వెళ్లి చిత్రయూనిట్ సందడి చేయగా నేడు విజయవాడ(Vijayawada) కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లారు. శ్రీలీల పద్దతిగా పట్టుచీర కట్టుకొని ఆలయంలోకి వెళ్ళింది.

Also Read : Bhagavanth Kesari : థియేటర్స్ లో ‘దంచవే మేనత్త కూతురా’ రీమిక్స్ సాంగ్.. బాలయ్య, కాజల్ మాస్ డ్యాన్స్..

ఆలయంలో అమ్మవారికి స్పెషల్ పూజలు చేశారు చిత్రయూనిట్. అనంతరం గుడి బయట మీడియాకు ఫోటోలు ఇవ్వగా ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. శ్రీలీల పట్టుచీరలో ఎంత క్యూట్ గా ఉందో, ఎంత ముద్దొస్తుందో అని పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.