Harvesting Honey : ఏడాదికి రూ. 5 లక్షల నికర ఆదాయం.. స్వయం ఉపాధిగా తేనెటీగల పెంపకం

తక్కువ పెట్టుబడి, కాస్తంత పెట్టుబడితో మెరుగైన లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో తేనెటీగల పెంపకం పట్ల రైతులతో పాటు చిరు ఉద్యోగులు, నిరుద్యోగ యువత దృష్టి సారిస్తున్నారు. గతంలో తేనెటీగల పెంపకాన్ని గ్రామీణ పేదలు, మహిళలు, రైతులు కుటీర పరిశ్రమంగా చేపట్టేవారు.

Harvesting Honey : ఏడాదికి రూ. 5 లక్షల నికర ఆదాయం.. స్వయం ఉపాధిగా తేనెటీగల పెంపకం

Harvesting Honey

Harvesting Honey : ప్రకృతి ప్రసాధించిన వరం తేనె. మానవాళికి హాని కలిగించే ఎన్నో రోగాలకు తేనె ఒక సంజీవినిలా పనిచేస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీని వాడకం పెరగడంతో మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో వ్యాపార సరళిలో తేనెటీగల పెంపకం ఊపందుకుంది. ఇప్పటికే చాలా మంది  మంది రైతులు, చిరు ఉద్యోగులు, నిరుద్యోగలు ఈ పరిశ్రమవైపు మళ్లారు. అలా మళ్లిన వాళ్లల్లో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తే సుబ్బారావు. తేనె పరిశ్రమతో ఐదేళ్లుగా అభివృద్ధిపథంలో పయనిస్తున్న ఈ రైతు అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు

తక్కువ పెట్టుబడి, కాస్తంత పెట్టుబడితో మెరుగైన లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో తేనెటీగల పెంపకం పట్ల రైతులతో పాటు చిరు ఉద్యోగులు, నిరుద్యోగ యువత దృష్టి సారిస్తున్నారు. గతంలో తేనెటీగల పెంపకాన్ని గ్రామీణ పేదలు, మహిళలు, రైతులు కుటీర పరిశ్రమంగా చేపట్టేవారు. అడవులు తగ్గిపోయి పచ్చదనం లోపించడం, పరిశ్రమలు పెరిగిపోవడం, పొలాల్లో రసాయనాల వాడకం పెరిగిపోవడం తేనెటీగ ల పెంపకానికి అవరోధంగా మారింది. ప్రస్థుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కొత్తరకం పనిముట్లు, ప్రక్రియలు అందుబాటులోకి రావటంతో క్రమంగా ఇది పూర్తిస్థాయి వృత్తిగాను, పారిశ్రామిక స్థాయికి ఎదిగింది.

READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!

రైతు పేరు రామకృష్ణ.  కృష్ణా జిల్లా, బుద్దవరం మండలం, ముద్దవరం గ్రామానికి చెందిన ఈయన గతంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవారు. అయితే సొంతంగా ఏదైన వ్యాపారం చేయలనే ఉద్దేశంతో తేనెటీగల పెంపకాన్ని ఎంచుకున్నారు. తేనె ఉత్పత్తి చేయడంలో శిక్షణ పొందిన రామకృష్ణ 2015 లో 20 పెట్టెలతో తేనెటీగల పెంపకం చేపట్టారు. అనుభవం వస్తున్నా కొద్ది పెట్టెల సంఖ్య పెంచుకుంటూ పోయారు. ప్రస్తుతం 350 పెట్టెలతో ప్రతి నెల 400 నుండి 500 కిలోల తేనె దిగుబడిని తీస్తున్నారు.

READ ALSO : Pests In Onion : ఉల్లిసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

ఎక్కడ పంటలు పూత దశలో ఉంటే అక్కడికి తేనె పెట్టెలను తరలిస్తూ.. ఏడాదికి 7 నుండి 8 నెలల పాటు నిరంతరాయంగా తేనె దిగుబడిని తీస్తున్నారు రైతు రామకృష్ణ. తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధిని పొందుతూనే.. మరికొంత మందికి ఉపాధినిస్తున్నారు.