Home » Porridge
గంజి మన చర్మానికి చాలా చక్కటి మేలు చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచే అధ్బుతమైన లక్షణాలను కలిగి ఉంది. ఒక కాటన్ బాల్ తీసుకుని గంజిలో ముంచి ముఖచర్మంపై అప్లై చేయడం ద్వారా మెుటిమలు మరియు మెుటిమలు వలన ఏర్పడిన నల్లటి మచ్చలు నివారించుకోవచ్చు.
ఉదయాన్నే అల్పాహారానికి బదులుగా గంజిని తాగటం వల్ల కడుపు నిండుగా ఉండటమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచి శక్తినిస్తాయి.
నీటిలో కొంచెం గంజిని కలిపి స్నానం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. గంజిలో బోలెడన్ని ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. కడుపులో మంటతో బాధపడేవారికి ఇది చాలా మంచిది.