Porridge : శరీరానికి శక్తిని ఇవ్వటమే కాదు, చలికాలంలో జీర్ణవ్యవస్ధను మెరుగుపర్చే గంజి!

ఉదయాన్నే అల్పాహారానికి బదులుగా గంజిని తాగటం వల్ల కడుపు నిండుగా ఉండటమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచి శక్తినిస్తాయి.

Porridge : శరీరానికి శక్తిని ఇవ్వటమే కాదు, చలికాలంలో జీర్ణవ్యవస్ధను మెరుగుపర్చే గంజి!

Porridge

Updated On : November 21, 2022 / 12:56 PM IST

Porridge : ప్రెజర్ కుక్కర్ల రాకతో గంజి అనే పదం గురించి తెలిసినవారే కరువయ్యారు. పాతరోజుల్లో అన్నం వండే సమయంలో తప్పనిసరిగా గంజి వంచుకునే సాంప్రదాయం ఉండేది. ఉదయాన్నే ఆ గంజిలో కాస్త ఉప్పు వేసుకుని సేవించేవారు. గంజి శరీరంలో శక్తిని ఇవ్వటానికి సహాయకారిగా పనిచేస్తుంది. దీని వల్ల ఉదయం సమయంలో అల్పాహారం తీసుకోవాల్సిన పడి కూడా ఉండదు. గంజిలో ఉండే అనేక పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గంజి తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ;

చలికాలంలో గంజిని తాగితే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. శరీరం వెచ్చగా ఉంటుంది. శీతాకాలం జ్వరాల సీజన్. జ్వరం కారణంగా శరీరంలో శక్తి సన్నగిల్లుతుంది. గంజిని తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉండడంతోపాటు వైరస్‌లు, బాక్టీరియాలు కూడా నశిస్తాయి. దీంతో జ్వరం త్వరగా తగ్గుతుంది. జ్వరం నుంచి కోలుకుంటారు. చలికాలంలో చల్లని గాలి కారణంగా చర్మంలో పగుళ్లు వస్తాయి. గంజిని తాగితే చర్మం పగలకుండా ఉంటుంది.

ఉదయాన్నే అల్పాహారానికి బదులుగా గంజిని తాగటం వల్ల కడుపు నిండుగా ఉండటమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచి శక్తినిస్తాయి. కడుపులో మంటతో బాధపడేవారికి గంజి చాలా మంచిది. గంజి డయేరియాను తగ్గించడమే కాకుండా ఉదర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తలకు పట్టిస్తే.. జుట్టు పట్టులా మెరుస్తుంది. గంజిలో ఉండే ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. గంజిలో అమైనో అమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండల పెరుగుదలకు ఉపయోగపడతాయి.