జీవితంలో మొట్ట మొదటిసారిగా రాజ్ ఘాట్ లో మూడు గంటల పాటు మౌన దీక్ష చేస్తున్నానని తెలిపారు. తనతోపాటు మూడు గంటల పాటు దీక్ష చేయలేని వారు మూడు నిముషాలైనా దీక్ష పాటించండి అని పిలుపునిచ్చారు. ఈరోజు 2కోట్ల10 లక్షల మంది తనతో పాటు ఉపవాసం ఉంటున్నారని వెల�
ఒకరు దేశాన్ని దోచుకుంటుంటే..మరొకరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్, మోదీకీ పెద్ద తేడా ఏమీ లేదన్నారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే అని విమర్శించారు.
బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ.. ఆ పార్టీకి తమకు సంబంధం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనకు వచ్చిన 8 సంవత్సరాల్లో 50 లక్షల కోట్లు అప్పులు చేశారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో 7 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు.