KA Paul: నాపై పోటీ చేసేందుకు అందరూ భయపడుతున్నారు: కేఏ పాల్

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాస్టర్స్ మీద వివక్ష చూపుతున్నాయని చెప్పారు.

KA Paul: నాపై పోటీ చేసేందుకు అందరూ భయపడుతున్నారు: కేఏ పాల్

KA Paul

Updated On : September 20, 2023 / 9:20 PM IST

KA Paul – Telangana elections 2023: ఎన్నికల్లో తనపై పోటీ చేసేందుకు అందరూ భయపడుతున్నారని ప్రజాశాంతి (prajashanti) పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నిజామాబాద్‌లో ఇవాళ నిర్వహించిన ప్రజాశాంతి పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం కేఏ పాల్ మాట్లాడారు. మునుగోడులో బీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచిందని చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాస్టర్స్ మీద వివక్ష చూపుతున్నాయని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ ఉనికిలో లేదని అన్నారు.

ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని కేఏ పాల్ చెప్పారు. అవినీతికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారు. దేశం మొత్తం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు.

లోక్‌సభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు బీజేపీ ఎన్నికల స్టంట్ అని కేఏ పాల్ చెప్పారు. కేసీఆర్ సర్కారు కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని చెప్పారు. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.

Jagan Kodi Katti Case : జగన్ కచ్చితంగా కోర్టుకి రావాల్సిందే.. కోడికత్తి కేసులో న్యాయవాది సలీమ్ హాట్ కామెంట్స్