Home » Propulsion Module
ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి కక్ష్యలోనే కొన్ని నెలలుపాటు ఉంది. తన పనిని విజయవంతంగా పూర్తిచేసింది. దీనిలోని పరికరాల సహాయంతో సమాచారాన్ని సేకరించి శాస్త్రవేత్తలకు ప్రొపల్షన్ మాడ్యూల్ పంపించింది.
చంద్రయాన్ -3 ప్రయోగంలో కీలక ఘట్టం విజయవంతం అయిందని ఇస్రో ట్విటర్ ద్వారా తెలిపింది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన తరువాత ‘థ్యాంక్స్ ఫర్ ది రైడ్, మేట్’ అని ల్యాండర్ మెసేజ్ పంపినట్లు ఇస్రో ట్వీట్ లో పేర్కొంది.
ఆగస్టు 17న చంద్రయాన్ -3 ప్రయోగంలో ఇస్రో కీలక ఘట్టాన్ని చేపట్టనుంది. గురువారం వ్యోమనౌకలోకి ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది.