ISRO Chandrayaan-3 : అరుదైన ఘనత సాధించిన ఇస్రో.. భూ కక్ష్యకు ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ మళ్లింపు

ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి కక్ష్యలోనే కొన్ని నెలలుపాటు ఉంది. తన పనిని విజయవంతంగా పూర్తిచేసింది. దీనిలోని పరికరాల సహాయంతో సమాచారాన్ని సేకరించి శాస్త్రవేత్తలకు ప్రొపల్షన్ మాడ్యూల్ పంపించింది.

ISRO Chandrayaan-3 : అరుదైన ఘనత సాధించిన ఇస్రో.. భూ కక్ష్యకు ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ మళ్లింపు

ISRO Chandrayaan-3

Chandrayaan-3 Propulsion Module : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అరుదైన ఘనత సాధించింది. చంద్రునిపైకి వస్తువులను పంపడమే కాకుండా.. వాటిని తిరిగి భూమికి తీసుకురాగలమని నిరూపించింది. ఇటీవల చంద్రయాన్ -3 ప్రయోగంతో ప్రపంచ వ్యాప్తంగా ఇస్రో ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. చంద్రుడిపైకి ప్రయోగించిన ప్రొపల్షన్ మాడ్యులర్ ను తాజాగా జాబిల్లి కక్ష్య నుంచి తిరిగి భూ కక్ష్య వైపు మళ్లించినట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్టు అనుకున్న దానికంటే అధిక ఫలితాలను భారత్ కు అందించినట్లయింది. తాజాగా దీనికి సంబధించిన సమాచారాన్ని ఇస్రో ట్వీట్ చేసింది. కక్ష్య పొడగింపు, ట్రాన్స్ ఎర్త్ ఇంజెక్షన్ విన్యాసాలతో దీనిని పూర్తి చేసినట్లు ఇస్రో వెల్లడించింది.

Also Read : Cyber ​​Crimes: 2022లో అత్యధిక సైబర్ నేరాలు జరిగిన రాష్ట్రం ఏదో తెలుసా? తెలంగాణలో నకిలీ వార్తల వ్యాప్తి కేసులు ఎన్నంటే?

2023 జూలై 14న చంద్రయాన్ – 3 మిషన్ ను చంద్రుని దక్షిణ ద్రువంపైకి ఇస్రో ప్రయోగించింది. ఆగస్టు 23న చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ సాప్ట్ ల్యాండింగ్ అయింది. దీంతో ఇస్రో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ చరిత్రలో నిలిచింది. చంద్రుడి దక్షిణ దృవంపై తమ లక్ష్యాలను చంద్రయాన్ -3 పూర్తి చేసింది. జాబిల్లిపై పరిశోధనలకు పంపిన చంద్రయాన్-3లో రెండు మాడ్యూళ్లు ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి ప్రొపల్షన్, రెండు ల్యాండర్ మ్యాడుల్. ప్రొపల్షన్ మాడ్యూల్ తో ల్యాండర్ మాడ్యూల్ అనుసంధానమై ఉంటుందా. ఇది వాహకనౌక నుంచి విడిపోయి, ల్యాండర్ మాడ్యూల్ ను చంద్రుడికి 100 కిలో మీటర్ల సమీపం వరకు తీసుకెళ్లింది. ఆ తరువాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయింది.

Also Read : Michaung Cyclone Effect : భయానకంగా మారిన మిచాంగ్ తుపాన్.. ఏపీలో తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి కక్ష్యలోనే కొన్ని నెలలుపాటు ఉంది. తన పనిని విజయవంతంగా పూర్తిచేసింది. దీనిలోని పరికరాల సహాయంతో సమాచారాన్ని సేకరించి శాస్త్రవేత్తలకు ప్రొపల్షన్ మాడ్యూల్ పంపించింది. ప్రొపల్షన్ మాడ్యూల్ మార్గాన్ని ఇస్రో తెలివిగా ప్లాన్ చేయడంతో దాదాపు 100 కిలోల ఇంధనం దీనిలో మిగిలింది. దీనిని వాడుకొని మరికొన్ని పరిశోధనలు ఇస్రో పూర్తిచేసింది. తాజాగా చంద్రుడి కక్ష్య నుంచి దీని మార్గాన్ని భూ కక్ష్య వైపు ఇస్రో శాస్త్రవేత్తలు మళ్లించారు.ఇది ప్రత్యేక ప్రయోగమని, తమ ప్రణాళికల్లో లేదని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపిన ఇస్రో.. తాజా ప్రయోగం ఆ విషన్ కు దోహదపడుతుందని తెలిపింది.