Cyber ​​Crimes: 2022లో అత్యధిక సైబర్ నేరాలు జరిగిన రాష్ట్రం ఏదో తెలుసా? తెలంగాణలో నకిలీ వార్తల వ్యాప్తి కేసులు ఎన్నంటే?

తెలంగాణతో సహా మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరాల రేటు జాతీయ సగటు 66.4 శాతం కంటే ఎక్కువగా నమోదైంది.

Cyber ​​Crimes: 2022లో అత్యధిక సైబర్ నేరాలు జరిగిన రాష్ట్రం ఏదో తెలుసా? తెలంగాణలో నకిలీ వార్తల వ్యాప్తి కేసులు ఎన్నంటే?

Cyber Crimes

NCRB Report : సైబర్ నేరాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఆర్థిక నేరాల్లోనూ రాష్ట్ర ముదుందని జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సిఆర్‌బి) నివేదిక విడుదల చేసింది. 2022లో దేశంలో నమోదైన నేరాలకు సంబంధించిన నివేదికను ఎన్‌సిఆర్‌బి సోమవారం వెల్లడించింది. తెలంగాణతో సహా మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరాల రేటు జాతీయ సగటు 66.4శాతం కంటే ఎక్కువగా నమోదైందని తెలిపింది. వీటిలో ఢిల్లీ (114.4శాతం) అగ్రస్థానంలో ఉండగా.. హర్యానా (118.7శాతం), తెలంగాణ (117శాతం), రాజస్థాన్ (115.1శాతం), ఒడిశా (103శాతం), ఆంధ్రప్రదేశ్ (96.2శాతం), అండమాన్, నికోబార్ (93.7శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అదేవిధంగా.. కేరళ (82శాతం), అస్సాం (81శాతం), మధ్యప్రదేశ్ (78.8శాతం), ఉత్తరాఖండ్ (77శాతం), మహారాష్ట్ర (75.1శాతం), పశ్చిమ బెంగాల్ (71.8శాతం) ఉన్నాయి.

Also Read : MLA Balmukund Acharya : రోడ్ల పక్కన మాంసం దుకాణాలన్నీ మూసేయండి : రాజస్థాన్‌లో గెలిచిన వెంటనే బీజేపీ ఎమ్మెల్యే ఆదేశాలు

2022 సంవత్సరంలో సైబర్ నేరాల విషయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్లు ఎన్‌సిఆర్‌బి నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 2022లో మొత్తం 65,893 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. ఇది అంతకుముందు సంవత్సరం 52,974 కేసులతో పోలిస్తే 24.4 శాతం ఎక్కువ. ఈ విభాగంలో నేరాల రేటు 2021లో 3.9శాతం నుంచి 2022లో 4.8కి పెరిగింది. దేశంలో సైబర్ క్రైంలలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలో 2022 సంవత్సరంలో 15,297 సైబర్ క్రైమ్ ఘటనలు నమోదయ్యాయి. తరువాత స్థానంలో కర్ణాటక నిలిచింది. కర్ణాటకలో 2022లో 12,556 కేసులు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10,117 కేసులు నమోదయ్యాయి. దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో.. బెంగళూరులో 9,940 సైబర్ క్రైం కేసులు నమోదైనట్లు ఎన్‌సిఆర్‌బి నివేదిక పేర్కొంది. ముంబైలో 4,724, హైదరాబాద్ 4,436 కేసులతో తరువాతి స్థానంలో ఉన్నాయి. హత్యలు, దొంగతనాలు, దోపిడీల వంటి సంప్రదాయ నేరాల విషయంలో తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నా.. సైబర్ నేరాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయని ఎన్‌సిఆర్‌బి పేర్కొంది. నకిలీ వార్తలు వ్యాప్తి చేయడంలోనూ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం పొందడం గమనార్హం.

Also Read : Michaung Cyclone Effect : భయానకంగా మారిన మిచాంగ్ తుపాన్.. ఏపీలో తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

తెలంగాణలో 2022 సంవత్సరంలో నేరాల వివరాలు ..
– సైబర్ నేరాలు మొత్తం 15,297 జరగాయి. వీటిలో ఏటీఎం మోసాలు (624), బ్యాంకింగ్ మోసాలు (3223), ఏటీపీ మోసాలు (2179), చీటింగ్ (4467), బెదిరించి వసూళ్లు (447), లైంగిక వేధింపులు (152), నకిలీ వార్తల వ్యాప్తి (264).

మహిళలపై నేరాలు..
మహిళల నేరాలు మొత్తం 22,066 జరిగాయి. వీటిలో కిడ్నాప్ లు (2518), ఆత్మహత్యకు ప్రేరేపించడం (375), వరకట్న మరణాలు (137), లైంగిక దాడి (2209), దాడి (2209), లైంగిక వేధింపులు( 685), వెంబడించడం (1517), అత్యాచారం (814), భర్త, బంధువుల వల్ల హింస (9996), పోక్సో (2752).

 ఇతర నేరాలు ..
హత్యలు (937), చోరీలు (15854), వాహన చోరీలు (6650), దోపిడీలు (520), నమ్మకద్రోహం (595), అక్రమ నిర్బందం (1372), కిడ్నాప్ లు (2981), పిల్లల కిడ్నాప్ లు (700), ఎస్సీఎస్టీ వేధింపులు( 1787), మనుషుల అక్రమ రవాణా ( 233), చీటింగ్ (21183), ఆహార కల్తీ (1635), మిస్సింగ్ (22,701), మాదక ద్రవ్యాల కేసులు (1279).