Home » rain water
Heavy Rain Telangana : మెదక్లో అత్యధికంగా 12.6 సెం.మీ, పాతురులో 8.6 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. సంగారెడ్డి జిల్లాలో 6 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.
మదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లిలో వర్షం పడింది.
ముఖ్యంగా హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ చార్మినార్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో అధికంగా వర్షపాతం నమోదు అయింది. దాంతో పాటు సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉండే అంబర్ పేట్ లో వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది.
నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ రాత్రి 7 గంటల తర్వాత మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది.
మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు వర్షపు నీటిలో చిక్కుకుంది. జిల్లాలో గత 2 రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలతో వాకాడు స్వర్ణముఖి బ్యారేజీ జలకళను సంతరించుకుని పరవళ్ళు తొక్కుతోంది.
గులాబ్ తుపాను ధాటికి మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నల్గోండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. గత మూడు రోజుల నుంచి ఎగువన కురుస్తున్న వర్షాలతో సాగర్ కు వరద నీరు వస్తోంది.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో మూడుగంటల పాటు ఎడతెరిపి లేకుండా వాన కుమ్మేసింది. జోరు వానతో తిరుమల మాడ వీధులు, రహదారులు పూర్తిగా జలమయం
హైదరాబాద్ లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. దీంతో ఉస్మానియా ఆస్పత్రిలోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఆస్పత్రిలో డ్రైనేజీ, వర్షపు నీరు ప్రవహిస్తోంది. అక్కడి ప్రాంతమంత