రష్యా ట్యాంకర్లు రాకుండా యుక్రెయిన్ బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. రష్యా ట్యాంకర్లు కీవ్‌లోకి చేరకుండా నగర శివార్లలోని ఇవాంకివ్ వంతెనను యుక్రెయిన్ సైన్యం బాంబులతో పేల్చేసింది.
యుక్రెయిన్‌లో రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా దాడులతో పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు.
2014లో యుక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న క్రిమియాను అంతర్జాతీయ సమాజం రష్యా భూభాగంగా గుర్తించాలని, యుక్రెయిన్ నాటో కూటమిలో చేరే ప్రయత్నాల నుంచి విరమించుకోవాలని రష్యా డిమాండ్.
యుక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో ఓవైపు సైన్యాలను మోహరించి.. వేర్పాటువాదులకు సహకరిస్తోంది.
యుక్రెయిన్‌లో ఉన్న భారతీయుల సంక్షేమమే తమ ధ్యేయమని భారత్ తెలిపింది. శాంతికి విఘాతం కలగకుండా చూడాలని భారత్ విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది.
యుక్రెయిన్‌తో యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఈ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.