Home » Salman Rushdie
న్యూయార్క్‌లో దాడికి గురైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ ఒక కంటి చూపు కోల్పోయినట్లు సమాచారం. అలాగే ఒక చేయి కూడా పని చేయడం లేదని సల్మాన్ ప్రతినిధి వెల్లడించినట్లు ఒక మీడియా సంస్థ కథనం ప్రచురించింది.
రచయిత సల్మాన్ రష్దీపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ అంశంపై భారత్ స్పందించడం ఇదే తొలిసారి.
సల్మాన్ రష్దీ ఇంకా బతికే ఉన్నాడనే విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు అతడిపై హత్యాయత్నం చేసిన హదీ మటార్. ఒక వీడియో ఇంటర్వ్యూ సందర్భంగా హదీ పలు సంచలన విషయాలు వెల్లడించాడు.
సల్మాన్ రష్దీపై దాడి జరగక ముందే మరో రచయిత్రిని చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇరాన్‌కు చెందిన ఒక తీవ్రవాద సంస్థ సానుభూతిపరుడు ఒక ట్వీట్ రిప్లై ద్వారా జేకే రౌలింగ్ను హెచ్చరించాడు.
న్యూయార్క్ నగరంలో జరిగిన దాడిలో గాయపడ్డ రచయిత సల్మాన్ రష్దీకి వెంటిలేటర్ తొలగించినట్లు, ఆయన మాట్లాడగలుగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రష్దీ ప్రతినిధి ఆండ్రూ వెల్లడించారు. ఈ దాడిని ఇరాన్ మీడియా సమర్ధించింది.
రచయిత సల్మాన్ రష్దీ పై న్యూ యార్క్ నగరంలో దాడి జరిగింది. ఓ వ్యక్తి రష్దీ పాల్గొన్న సమావేశంకు వచ్చి కత్తితో అతనిపై హత్యాయత్నంకు పాల్పడ్డాడు.
భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటిష్ నవలా రచయిత, బుకర్ ఫ్రైజ్ విజేత సల్మాన్ రష్దీ పై అమెరికా న్యూయార్క్ లో దాడి జరిగింది. చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇనిస్టిట్యూట్ లో రష్దీ ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి దూసుకొచ్చి కత్తితో దాడి చేశాడు.