Salman Rushdie: ఒక కంటి చూపు కోల్పోయిన సల్మాన్ రష్దీ.. వెల్లడించిన సల్మాన్ ప్రతినిధి
న్యూయార్క్‌లో దాడికి గురైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ ఒక కంటి చూపు కోల్పోయినట్లు సమాచారం. అలాగే ఒక చేయి కూడా పని చేయడం లేదని సల్మాన్ ప్రతినిధి వెల్లడించినట్లు ఒక మీడియా సంస్థ కథనం ప్రచురించింది.

Salman Rushdie: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ గత ఆగష్టులో, న్యూయార్క్‌లో దాడికి గురైన సంగతి తెలిసిందే. సల్మాన్ రష్దీ రాసిన ‘ద శాటానిక్ వెర్సస్’ పుస్తకానికి నిరసనగా, హదీ మటార్ అనే వ్యక్తి ఆయనపై దాడి చేశాడు.
Virat Kohli: కోహ్లీ కళ్లల్లో నీళ్లు.. పాక్‌పై గెలుపు తర్వాత విరాట్ భావోద్వేగం
కన్ను, మెడ, భుజంతోపాటు దాదాపు 12 చోట్ల కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందిన ఆయనకు సంబంధించిన వివరాలు కొద్ది రోజులుగా వెల్లడి కాలేదు. కాగా, తాజాగా రష్దీ ప్రతినిధి ఆయన ఆరోగ్యం గురించిన వివరాల్ని వెల్లడించినట్లు అక్కడి ఒక మీడియా సంస్థ తెలిపింది. ఈ దాడిలో సల్మాన్ రష్దీ ఒక కంటి చూపు కోల్పోయినట్లు ఆండ్రూ వైల్ అనే ఆయన ప్రతినిధి వెల్లడించారు. ఒక కంటి చూపుతోపాటు, ఒక చేయి కూడా సరిగ్గా పని చేయడం లేదన్నారు.
సల్మాన్ చేతికి సంబంధించిన నరాలు తెగిపోవడం వల్ల చేయి పని చేయడం లేదని చెప్పారు. ఆయన మెడపై కూడా అనేక గాయాలున్నాయని తెలిపారు. కాగా, సల్మాన్ రష్దీ గాయాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. ఇంతకుమించిన వివరాలేవీ తెలియరాలేదు.