Home » Scientist's suggestions
ఖరీఫ్ తో పోల్చుకుంటే రబీలో విత్తన మోతాదు, సాళ్ల మధ్య తగిన దూరం పాటించటంలో జాగ్రత్త వహించాలి. ఖరీఫ్ తో పోలిస్తే రబీ పంట కాలం తగ్గుతుంది కాబట్టి మొక్కల సంఖ్యను పెంచుకుని సగటు దిగుబడిని మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
కొమ్మలు కుళ్లిపోయి, క్రమేపి మోడువారుతున్న ఈ మిరప మొక్కలను చూడండి. దీన్ని కొయినోఫొరా కొమ్మకళ్లు తెగులు అంటారు. అధిక వర్షాలు, తరచూ చిరుజల్లుల వల్ల ఈ తెగులు కలిగించే శిలీంధ్రం ఉధృతి తోటల్లో పెరిగిపోయింది.
పెరుగుదల దశలో వున్న పైరులో రైతులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య కాండంతొలుచు పురుగు. నారు మడి దశ నుండి కంకితయారయ్యే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించే ఈ పురుగు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ముఖ్యంగా ప్రస్తుతం మొక్కజొన్నను పీడిస్తున్న సమస్య కత్తెరపురుగు. పంట వేసిన మొదలు కోత కోసే వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఈ పురుగుల ఉధృతిని గమనించినట్లైతే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
ప్రధానంగా ఎర్రనల్లి నష్టం అధికంగా కనిపిస్తోంది. అసలే కరోనా ప్రభావంతో మార్కెట్ లు లేక పంటను అమ్ముకోలేక సతమతమవతున్న రైతులకు ఈ ఎర్రనల్లి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ముఖ్యంగా బోరాన్ లోపం తో పంట నాణ్యత తగ్గడమే కాకుండా కాయలు పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దోస మొలకెత్తిన తరువాత తీగలు 4 నుండి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది.