Corn Crop : మొక్కజొన్నకు కత్తెరపురుగుల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్త సూచనలు

ముఖ్యంగా ప్రస్తుతం మొక్కజొన్నను పీడిస్తున్న సమస్య కత్తెరపురుగు. పంట వేసిన మొదలు కోత కోసే వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి.  ఈ పురుగుల ఉధృతిని గమనించినట్లైతే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

Corn Crop : మొక్కజొన్నకు కత్తెరపురుగుల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్త సూచనలు

Corn Crop

Corn Crop : తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు రైతులు మెట్టపంటలను విత్తారు . కొన్ని చోట్ల విత్తేందుకు సిద్దమవుతున్నారు.  అడపాదడప కురుస్తున్న వర్షాలకు చీడపీడలు ఆశించడమే కాకుండా , సూక్ష్మధాతు లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొక్కజొన్నలో కత్తెరపురుగు ఉధృతి పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ప్రస్తుత ఉన్ప పంటలో, ఇప్పుడు వేయబోయే పంటల్లో తొలిదశలోనే ఈ పురుగును నివారించించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం..

READ ALSO : Castor Cultivation : ఆముదం సాగులో మెళకువలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు కూడా మారాయి. అయితే ఇప్పటికే వేసిన మొక్కజొన్న పంట లేత దశలో ఉంది. కాబట్టి తేమకు చాలా సున్నితం. అధిక నీటి నిలువను తట్టుకోలేదు. పొలం నుండి మురుగు నీటిని వీలైనంత త్వరాగా తీసివేయాలి. అధిక తేమ వలన భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్ని ఊదారంగులోకి మారే అవకాశం ఉంది.

READ ALSO : Vande Bharat Express : ఒడిశా విద్యార్థులకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉచిత ప్రయాణం

కావున వర్షాలు నిలిచిన తరువాత 19-19-19 (మూడు పంతొమ్ముదులు) 5 గ్రాములు  లేదా 20 గ్రాముల డిఏపి మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేయాలి. అలాగే రైతులు చీడపీడలు, కలుపు సమస్యలపై సరైన దృష్టి సారించాలి. ముఖ్యంగా ప్రస్తుతం మొక్కజొన్నను పీడిస్తున్న సమస్య కత్తెరపురుగు. పంట వేసిన మొదలు కోత కోసే వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి.  ఈ పురుగుల ఉధృతిని గమనించినట్లైతే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త నాగరాజు.

READ ALSO : ఎడమ చేతివాటం ఉన్న ప్రముఖులు

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని ఆలస్యమైన ప్రాంతాల్లో కంది, మొక్కజొన్నను విత్తేందుకు సిద్దమవువుతన్నారు. అయితే కత్తెర పురుగును అధిగమించాలంటే విత్తన శుద్ది తప్పకుండా చేయాలంటున్నారు శాస్త్రవేత్తలు.