Home » shivering
దేశ రాజధాని ఢిల్లీపై చలి పంజా విసిరింది. ఓవైపు చలి.. మరోవైపు పొగ మంచు కమ్ముకుంది. తీవ్ర చలికి ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోతూవుండటం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. నేటి నుంచి మూడు రోజులు అతి శీతల గాలులు వీచే అవకాశం ఉంది.
ఉత్తరభారతాన్ని మంచు గజ గజ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. చలి గాలుల తీవ్రతకు ఉష్ణోగ్రతలు ఘనంగా పడిపోతున్నాయి. జమ్మూకశ్మీర్ లో మంచు ఉప్పెన ముంచుకొచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకి చలి పెరుగుతోంది. గడ్డ కట్టే చలితో జనాలు విలవిలలాడిపోతున్నారు. చలిగాలులకు తోడు అత్యల్ప ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి
తెలంగాణలోని అర్లిటీలో 2.7 డిగ్రీలు, ఏపీలోని లంబసింగిలో సున్నా డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలితీవ్రతకు అద్దం పడుతుంది