Home » srishailam project
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పోతిరెడ్డిపాడు వద్ద ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు శనివారం వరకు 4వేల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చింది. అయితే ఆదివారానికి పూర్తిగా వరద నీరు నిలిచిపోయింది. ఇక ఎగువ నుంచి వరద ఆగిపోవడంతో దిగువకు నీటి విడుదలను నిలిపివేశారు అధికారులు.
తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండటంతో ఆలమట్టికి 7113 కుసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఇక జూరాలకు 5 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 6655 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.