Water Dispute : జల వివాదం..పోతిరెడ్డిపాడు వద్ద భారీ బందోబస్తు

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పోతిరెడ్డిపాడు వద్ద ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

Water Dispute : జల వివాదం..పోతిరెడ్డిపాడు వద్ద భారీ బందోబస్తు

Water Dispute

Updated On : July 3, 2021 / 1:27 PM IST

Water Dispute : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పోతిరెడ్డిపాడు వద్ద ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి బన్నూరు గ్రామం వద్ద ఏర్పాటు చేయగా, మరొకటి పోతిరెడ్డిపాడు సమీపంలో ఏర్పాటు చేశారు.

రెండు చెక్ పోస్టుల వద్ద 30 మందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. చాబోలు, పోతిరెడ్డిపాడు గ్రామాల ప్రజలను మాత్రమే అనుమతిస్తున్నారు. మిగతావారిని అనుమతించడం లేదు.

ఇక కంపెనీ ఉద్యోగులైతే తప్పనిసరి ఐడి కార్డు చూపించాలని పోలీసులు తెలిపారు. క్షున్నంగా తనిఖీ చేసిన తర్వాత అక్కడి నుంచి పంపుతున్నారు. కాగా ఈ అంశంపై పోలీసులు స్పందించారు. కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు అధికారులు పరిశీలనకు వస్తున్నారని.. అందుకే చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి భద్రత కల్పించామని తెలిపారు.