ఒక పక్క దేశవ్యాప్తంగా బలపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే, మరోపక్క ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీలోని జాతీయ స్థాయి కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.
పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సునీల్ జఖార్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ‘మన్ కీ బాత్’ పేరుతో శనివారం ఫేస్‌బుక్ లైవ్‌లో పాల్గొన్న సునీల్, పార్టీని వీడుతున్నట్లు చెప్పాడు.