Punjab Congress: కాంగ్రెస్‌కు కీలక నేత గుడ్‌బై!

పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సునీల్ జఖార్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ‘మన్ కీ బాత్’ పేరుతో శనివారం ఫేస్‌బుక్ లైవ్‌లో పాల్గొన్న సునీల్, పార్టీని వీడుతున్నట్లు చెప్పాడు.

Punjab Congress: కాంగ్రెస్‌కు కీలక నేత గుడ్‌బై!

Punjab Congress

Updated On : May 14, 2022 / 1:47 PM IST

Punjab Congress: ఒకపక్క కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలా అనే అంశంపై కీలక నేతలంతా రాజస్తాన్‌లో జరుగుతున్న మేధోమధన సదస్సు ‘నవ సంకల్ప్ చింతన్ శివిర్’లో పాల్గొంటుంటే, మరోపక్క పార్టీకి చెందిన కీలక నేత ఒకరు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సునీల్ జఖార్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ‘మన్ కీ బాత్’ పేరుతో శనివారం ఫేస్‌బుక్ లైవ్‌లో పాల్గొన్న సునీల్, పార్టీని వీడుతున్నట్లు చెప్పాడు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఇటీవల సునీల్‌పై అభియోగాలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ క్రమశిక్షా కమిటీ చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుండటంతో ఆయన పార్టీని వీడారు.

Punjab: పంజాబ్ జైళ్లలో వీఐపీ రూమ్స్ రద్దు.. సీఎం నిర్ణయం

పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన సునీల్, సీఎం అభ్యర్థిగా కూడా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీలో కూర్చుని, రాష్ట్రంలో పార్టీని నాశనం చేసిందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ మంచి వ్యక్తి అని, పార్టీ సిద్ధాంతాల్ని వదలొద్దని సోనియాకు సూచించారు. తన ట్విట్టర్ అకౌంట్ బయో నుంచి కాంగ్రెస్‌ను తొలగించారు. చివరగా కాంగ్రెస్‌కు గుడ్ లక్ అంటూ.. గుడ్‌బై చెప్పేశారు. సునీల్ జఖార్.. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు.