Home » Super Star Krishna Passed Away
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణవార్తతో టాలీవుడ్ షాక్‌కు గురయ్యింది. ఆయన మరణవార్త తెలుసుకున్న యావత్ టాలీవుడ్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఆయన నివాసానికి వెళ్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూయడంతో, యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణకు తమ నివాళులర్పించేందుకు సినీ రంగానికి చెందిన సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు నానక్‌రామ్‌గూడలోని కృష్ణవిజయ నివాసానికి చేరుకుంటున్న�
కృష్ణ భౌతిక దేహాన్ని సందర్శించిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి కన్నీరు పెట్టుకున్నారు. మహేష్ బాబు, కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోస్‌కు కృష్ణ భౌతికకాయాన్ని తరలించి, కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక మధ్యాహ్నం 2గంటల సమయంలో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంకు తరలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3గంటల సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల ప్రక్రియను ప