Super Star Krishna Passed Away: కృష్ణ భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి.. కన్నీరు పెట్టుకున్న చిరంజీవి..

కృష్ణ భౌతిక దేహాన్ని సందర్శించిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి కన్నీరు పెట్టుకున్నారు. మహేష్ బాబు, కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Super Star Krishna Passed Away: కృష్ణ భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి.. కన్నీరు పెట్టుకున్న చిరంజీవి..

Super Star Krishna Passed Away

Updated On : November 15, 2022 / 2:55 PM IST

Super Star Krishna Passed Away: సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని రాజకీయ, సినీ ప్రముఖులు సందర్శించి నివాళులర్పిస్తున్నారు. నానక్‌రామ్‌గూడలో విజయకృష్ణ నివాసంలో ఉన్న కృష్ణ భౌతికకాయం వద్ద సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య, రాజేంద్రప్రసాద్ రాఘవేంద్రరావు, అడవి శేషు, సురేష్ బాబు, త్రివిక్రమ్తో పాటు పలువురు సినీ ప్రముఖులు పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. మహేష్ బాబుతో పాటు కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

Super Star Krishna Passed Away: రేపు ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో కృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు

తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు పెద్ద‌ఎత్తున తరలివచ్చి కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులు కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మహేష్ బాబుతో పాటు, కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

Mahesh Babu : అన్నయ్య అమ్మ ఇప్పుడు నాన్న.. మహేష్ బాబుకే ఎందుకిలా?

కృష్ణ భౌతిక దేహాన్ని సందర్శించిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి కన్నీరు పెట్టుకున్నారు. మహేష్ బాబు, కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించి మహేష్ బాబును ఓదార్చారు.