Super Star Krishna Passed Away: రేపు ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో కృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు

బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోస్‌కు కృష్ణ భౌతికకాయాన్ని తరలించి, కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక మధ్యాహ్నం 2గంటల సమయంలో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంకు తరలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3గంటల సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల ప్రక్రియను పూర్తి చేస్తారు.

Super Star Krishna Passed Away: రేపు ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో కృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు

Super Star Krishna Passed Away

Super Star Krishna Passed Away: సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. కృష్ణతో ఉన్నఅనుబంధాన్ని ప్రముఖులు నెమరవేసుకుంటున్నారు. కాగా కృష్ణ భౌతికకాయానికి బుధవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అత్యక్రియల ప్రక్రియ జరగనుంది.

Super Star Krishna : దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు.. సూపర్‌స్టార్‌ కృష్ణ లైఫ్ స్టోరీ..

మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కృష్ణ భౌతికకాయాన్ని గచ్చిబౌలిలోని ఆస్పత్రి నుంచి నానక్ రామ్‌గూడలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ సినీ, రాజకీయ ప్రముఖలు తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. కుమారుడు మహేష్ బాబు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కృష్ణతో వారికి ఉన్న అనుబంధాన్ని ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు.

Krishna : రాజీవ్ గాంధీ పిలుపుతో కృష్ణ రాజకీయ అరంగేంట్రం..

సాయంత్రం 5గంటల సమయంలో కృష్ణ భౌతిక కాయాన్ని నానక్ రామ్‌గూడ నివాసం నుంచి గచ్చిబౌలి స్టేడియానికి తరలిస్తారు. అక్కడే ప్రజలు, అభిమానుల సందర్శనార్థం రేపు (బుధవారం) ఉదయం వరకు ఉంచుతారు. బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోస్‌కు తరలించి, కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక మధ్యాహ్నం 2గంటల సమయంలో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంకు కృష్ణ భౌతిక‌కాయాన్ని తరలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3గంటల సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల ప్రక్రియను పూర్తి చేస్తారు.