Home » sweet corn
ఆరోగ్యకరమైన ఆహారంలో మొక్కజొన్న ప్రధానమైనది నిపుణులు చెబుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం, తాజా మొక్కజొన్నలో కేలరీలు, చక్కెర, కార్బోహైడ్రేట్, కొవ్వు, డైటరీ ఫైబర్, ప్రోటీన్ లు ఉంటాయి.
మొక్క గింజలతో తయారైన నూనెలో ఫైటోస్టెరాల్స్ అనే సహజ పదార్థముంటుంది. ఇది శరీరం కొలెస్ట్రాల్‌ను తక్కువగా గ్రహించుకునేందు ఉపకరిస్తుంది. అలాగే గుండెకు మేలు చేసే యుబిక్వినోన్ అనే విటమిన్ ఉంటుంది.
స్వీట్ కార్న్ లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఎ ను అందిస్తుంది. వ్యాధినిరోధకతను పెంచడానికి స్వీట్ కార్న్ ఉపకరిస్తుంది.
ముఖ్యంగా డయాబెటిస్ రోగులు స్వీట్ కార్న్ ను పరిమితంగా తీసుకోవటం వల్ల శరీరంలో చక్కెర స్ధాయిలు అదుపులో ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది.