Sweet Corn : స్వీట్ కార్న్ తినటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?..
స్వీట్ కార్న్ లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఎ ను అందిస్తుంది. వ్యాధినిరోధకతను పెంచడానికి స్వీట్ కార్న్ ఉపకరిస్తుంది.

Sweet Corn
Sweet Corn : అధిక పోషకాలు కలిగిన ఆహారంలో స్వీట్ కార్న్ ఒకటి. స్వీట్ కార్న్ ను బాయిల్ చేసి, స్టీమ్ చేసి, గ్రిల్ చేసి తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. స్నాక్స్ తినాలనిపించినప్పుడు హెల్తీ స్వీట్ కార్న్ తినడం మంచిది. వందగ్రాముల ఉడికించిన మొక్కజొన్న గింజల్లో దాదాపు వంద కెలోరీలు ఉంటాయి. అన్ని రకాల ముడిధాన్యాల్లానే మొక్కజొన్నలో కూడా పిండి పదార్థాలు అధికం. ఈ పిండిపదార్థాల్లో భాగంగానే కొంత చక్కెర మొక్కజొన్న గింజల్లో ఉంటుంది. మొక్కజొన్న గింజల్లో, పేలాల్లో కూడా పీచుపదార్థాలు ఉంటాయి. బీ- 3, బీ- 5, బీ-6, బీ- 9 మొదలైన విటమిన్లు ఉంటాయి. స్వీట్ కార్న్ లో ఫైటో కెమకిల్స్ ఎక్కువగా ఉంటాయి. కార్న్ లో ఉండే విటమిన్ బి12 అనీమియా తగ్గిస్తుంది. ఇది గర్భిణీలకు చాలా అవసరమైనది.
మొక్కజొన్నలానే బేబీ కార్న్‌లో కూడా పిండి పదార్థాలు ఉంటాయి. ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఎక్కువ. కొవ్వులు చాలా తక్కువ. బేబీకార్న్‌లో థయామిన్, రిబోఫ్లావిన్, ఫోలిక్ ఆసిడ్, నయాసిన్ లాంటి బీ విటమిన్లు ఉండడం వల్ల, ఇది శక్తినిచ్చే ఆహారంగా ఉపయోగ పడుతుంది. వీటిలోని విటమిన్- సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కూరలు, మిగతా కూరగాయలతో కలిపి వీటిని వండితే అన్ని పోషకాలు యధాతథంగా ఉంటాయి. కానీ నూనెలో డీప్ ఫ్రై చేస్తే మాత్రం పోషకాలు తగ్గుతాయి.
స్వీట్ కార్న్ లో బీటా కెరోటిన్, క్సాన్ థిన్స్, లూటైన్ వంటి యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పిల్లలకు ఇది మంచి స్నాక్. మొక్కజొన్న కంటే బేబీకార్న్‌లో పిండి పదార్థాలు తక్కువ. వీటిని కూరగాయలతో సమంగా వాడుకోవచ్చు. అన్ని వయసుల వారు తినవచ్చు. కార్న్స్ లో ఉండే ఫినాలిక్ కాంపౌండ్ ఫెరూలిక్ యాసిడ్,బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణమయ్యే ట్యూమర్స్ ను తగ్గించి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల, జీర్ణాశయ ఆరోగ్యానికి, రక్తంలో చక్కర స్థాయి అదుపులో ఉంచడానికి స్వీట్‌కార్న్ మంచిది.
స్వీట్ కార్న్ లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఎ ను అందిస్తుంది. వ్యాధినిరోధకతను పెంచడానికి స్వీట్ కార్న్ ఉపకరిస్తుంది. అధిక పిండి పదార్థాల వల్ల మధుమేహం ఉన్న వారు వివిధ రకాల ధాన్యాలతో పాటు మొక్కజొన్నను కూడా పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. 100 గ్రాముల స్వీట్ కార్న్ లో 342 కేలరీలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్ధాయిల పెరుగుదలకు కారణమౌతాయి. శరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచటంలో స్వీట్ కార్న్ సహాయపడుతుంది.
ఇదిలా ఉంటే స్వీట్ కార్న్ అధికంగా తీసుకోవం వల్ల కొన్ని అనర్ధాలు కూడా ఉన్నాయి. శరీరంలో హానికరమైన టాక్సిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇందులో ఉండే అధికమైన ఫైబర్ అజీర్ణ సమస్యలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. అతిగా తీసుకోవటం వల్ల విరోచనాలు కలిగవచ్చు. కొంతమందిలో స్వీట్ కార్న్ పడకపోవటం వల్ల చర్మం పై దద్దుర్లు, వాంతులు, అలెర్జీలకు దారితీసే ఛాన్స్ ఉంటుంది.