Home » Telangana Rain Alert
భానుడి భగభగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఈ ఏడాది కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. Telangana Rain Alert
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం పడగా.. శనివారం వాతావరణం చల్లబడింది.
ఏపీలోని కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ రద్దు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు...Telangana Rain Alert
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నుంచి గురువారం వరకు పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Telangana : జూన్ 3వ వారం నాటికి నైరుతి రుతుపవనాలు తీరం దాటి రాష్ట్రంలోకి రానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఈ వేసవిలో వడగాల్పులు తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి తెలిపారు.