Nairuthi Ruthupavanalu : గుడ్‌న్యూస్‌.. ఈసారి ముందుగానే తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు

భానుడి భగభగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఈ ఏడాది కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది.

Nairuthi Ruthupavanalu : గుడ్‌న్యూస్‌.. ఈసారి ముందుగానే తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు

Monsoons

Updated On : May 15, 2024 / 2:11 PM IST

Rain Alert to AP and Telangana : భానుడి భగభగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఈ ఏడాది కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. జూన్ ఫస్ట్ కంటే ముందే కేరళ తీరాన్ని నైరుతి తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు తేలికపాటి వర్షాలు పడతాయని ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 19వ తేదీ వరకు దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ తెలిపింది.

Also Read: Jr NTR : తూర్పు గోదావరి జిల్లాలోని ఆ ఆలయానికి.. ఏకంగా అన్ని లక్షలు డొనేట్ చేసిన ఎన్టీఆర్..

రుతుపవనాలు కేరళకు జూన్ మొదటి వారంలో చేరాలంటే అరేబియా సముద్రంలో అనుకూల వాతావరణం ఉండాలి. రుతుపవనాల రాకకు ముందు అరేబియా సముద్రంలో అల్పపీడనం కానీ, వాయుగుండం కానీ ఏర్పడ కూడదు. అలా ఏర్పడితే నైరుతిరాకను ఆలస్యం చేస్తాయి. అయితే, ఈ నెలాఖరులోగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, మరికొన్ని రోజులైతే స్పష్టత వస్తుందని చెబుతున్నారు. గత ఏడాది మే 19న దక్షిణ అండమాన్ సముద్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యంగా జూన్ 8న కేరళను తాకాయి. ఇంకోవారం రోజులు అయితేకానీ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అంశంపై క్లారిటీ రాలేమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

Also Read : ఏపీలో పెరిగిన పోలింగ్ శాతం.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించిఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో గాలివాన, పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.