Home » Wrongside driving
హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు పోలీసులు. వాహనదారులు రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా విధించనున్నారు.
ఇకపై రాంగ్ రూట్ లో వెళ్లినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా తాట తీస్తామంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. జరిమానాల మోత మోగిస్తామంటున్నారు. రాంగ్ రూట్ లో బండి నడిపితే రూ.1700 ఫైన్ వేయనున్నారు. ట్రిపుల్ రైడింగ్ అయితే రూ.1200 జరిమానా వేస్తారు.