Hyderabad New Traffic Rules : రాంగ్ రూట్‌కు రూ.1700, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం
హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు పోలీసులు. వాహనదారులు రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా విధించనున్నారు.

Hyderabad New Traffic Rules : హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు పోలీసులు. వాహనదారులు రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా విధించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వివరించారు.
రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్‌కి అసలు కారణం వాహనదారులు రూల్స్ సరిగా పాటించకపోవడమే అని పోలీసులు భావిస్తున్నారు. అలాగే రూల్స్ పాటించని వారి వల్ల రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. అందువల్ల రూల్స్ కరెక్ట్ గా ఫాలో అయ్యేలా చేసేందుకు ఫైన్లు పెంచాలని నిర్ణయించారు. ఆ ప్రకారం.. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేసిన వారికి రూ.1,700 ఫైన్ వేస్తారు. అలాగే.. ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 జరిమానా తప్పదు. ఇలా భారీ ఫైన్ విధించడం వల్ల ఇకపై వాహనదారులు రాంగ్ రూట్‌లో వెళ్లరని, ట్రిపుల్ రైడింగ్ చెయ్యరని పోలీసులు భావిస్తున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ప్రతి శనివారం, ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవింగ్ నిర్వహిస్తున్న పోలీసులు.. ఈ దిశగా మరింత ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. నవంబర్ 28 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నారు. తద్వారా రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నారు.
సిటీలో వాహనదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం వచ్చేసిందని, లేదంటే మీ నెల జీతం ట్రాఫిక్ ఫైన్స్ చెల్లించడానికి కూడా సరిపోదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారికి మోటారు వెహికిల్ చట్టంలోని సెక్షన్ 119/ 177 & 184 కింద రూ.1700 (200 + 500 + 1000 ) జరిమానా చెల్లించాల్సిందే. ఒకవేళ ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడితే.. రూ. 1200 జరిమానా చెల్లించుకోవాల్సిందే. వాహనదారులు ట్రాఫిక్ గైడ్ లైన్స్ సరిగ్గా పాటించి సురక్షితంగా గమ్యం చేరేలా చేయడం కోసమే ఈ కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు.
ఈ నెల 21 నుంచి రాంగ్ సైడ్, ట్రిపుల్ డ్రైవింగ్ ఉల్లంఘనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం 28వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి జరిమానా విధించనున్నట్టు వెల్లడించారు.