సరికొత్త ఫీచర్లతో రెనాల్ట్ ట్రైబర్ కాంపాక్ట్ MPV కారు.. లుక్ అదిరింది.. ధర రూ.6 లక్షల లోపే..

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ రెనాల్ట్ నుంచి కొత్త మోడల్ ఎంపీవీ కారు భారత మార్కెట్లోకి వచ్చింది. గతంలో 2021 అప్ కమింగ్ రెనాల్ట్ కార్ మోడల్ ట్రైబర్ ఫొటోలు లీకయ్యాయి. ఇప్పుడు అదే మోడల్ ట్రైబర్ కాంపాక్ట్ ఎంపీవీ కారును కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మోడల్ కారులో ఎలాంటి కాస్మెటిక్ లేదా మెకానికల్ మార్పులేమి చేయలేదు.

సరికొత్త ఫీచర్లతో రెనాల్ట్ ట్రైబర్ కాంపాక్ట్ MPV కారు.. లుక్ అదిరింది..  ధర రూ.6 లక్షల లోపే..

2021 Renault Triber compact MPV Car : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ రెనాల్ట్ నుంచి కొత్త మోడల్ ఎంపీవీ కారు భారత మార్కెట్లోకి వచ్చింది. గతంలో 2021 అప్ కమింగ్ రెనాల్ట్ కార్ మోడల్ ట్రైబర్ ఫొటోలు లీకయ్యాయి. ఇప్పుడు అదే మోడల్ ట్రైబర్ కాంపాక్ట్ ఎంపీవీ కారును కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మోడల్ కారులో ఎలాంటి కాస్మెటిక్ లేదా మెకానికల్ మార్పులేమి చేయలేదు. కానీ, అదనంగా కొన్ని కొత్త ఫీచర్లను కంపెనీ యాడ్ చేసింది. 2021 రెనాల్ట్ ట్రైబర్ మోడల్ కారు బేసిక్ వేరియంట్ ప్రారంభ ధర మార్కెట్లో రూ.5.30 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉంది. టాప్ ఎండ్ RXZ AMT డ్యుయల్ టన్ మోడల్ కారు..


ఇది కొత్త ఎడిషన్.. మార్కెట్లో దీని ధర రూ.7.82 లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉంది. వేరియంట్ ఆధారంగా ట్రైబర్ మోడల్ కారు ధరలు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు పెరిగాయి. ఈ కొత్త మోడల్ కారులో కొత్త ఫీచర్లను రెనాల్ట్ యాడ్ చేసింది. అందులో కొత్త పెయింట్ ఆప్షన్ ఒకటి చేర్చింది. ఈ కొత్త కలర్ పేరు సెడార్ బ్రౌన్ అందించారు. అలాగే RXZ వేరియంట్ కారులో కూడా ఇప్పుడు డ్యుయల్ పెయింట్ ఆప్షన్ అందించారు. ఈ డ్యుయల్ పెయింట్ కలర్ పైకప్పు భాగంలో, బయటివైపు రియర్ వ్యూ మిర్రర్ పై కనిపిస్తుంది.

ఈ డ్యుయల్ పెయింట్ తో ఏదైనా కలర్ మిక్స్ చేసుకోవచ్చు. RXZ వేరియంట్ లో రియర్ వ్యూ మిర్రర్ దగ్గర బయటివైపు ఎల్ ఈడీ టర్న్ ఇండికేటర్లను అదనంగా అమర్చారు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఫోన్ కంట్రోల్స్, అలాగే టాప్ ఎండ్ ఆర్ఎక్స్ జెడ్ వేరియింట్ కారులో డ్రైవర్ సీటు హైట్ అడ్జెస్ట్ చేసుకోవచ్చు. స్టాండెర్డ్ హార్న్ తో పాటు రెనాల్ట్ అదనంగా డ్యుయల్ హార్న్ ఆప్షన్ అందిస్తోంది.

ట్రైబర్ కారు ఒకే ఒక పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. త్రి సిలిండర్ కలిగి ఉంటుంది. గరిష్టంగా ఇంజిన్ టర్క్యూ ఔట్ ఫుట్ 96Nm వరకు అందిస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. EASY-R 5 స్పీడ్ AMT గేర్ బాక్సు కూడా ఉంది. వెనుక టైర్లకు డిస్క్ బ్రేకులు, డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. కారు పైకప్పుభాగంలో 50కిలోల వరకు ఏదైనా బరువును క్యారీ చేయొచ్చు.

  • ఎల్ఈడీ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్,
  • స్మార్ట్ యాక్సెస్ కార్డు
  • పుష్ బటన్/ స్టార్ట్ అండ్ స్టాప్
  • టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
  • ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పవర్ విండోలు
  • ఎలక్ట్రికల్ అడ్జెస్ట్ మెంట్ రియర్ వ్యూ మిర్రర్
  • మూడు వరుసల్లో 12V సాకెట్లు, రియర్ వ్యూ కెమెరా
  • 2, 3 వరుస సీట్లకు ఏసీ వెంటలేషన్, ఇండిపెండెంట్ కంట్రోల్
  • ABS, EBD, డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, స్పీడ్ అలర్ట్ వార్నింగ్
  • రియర్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ వార్నింగ్స్
  • స్టయిల్డ్ ఫ్లెక్స్ వీల్స్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్
  • 1.0 లీటర్ టర్బో చార్జడ్ పెట్రోల్ ఇంజిన్
  • డ్యుయల్ టోన్ డ్యాష్ బోర్డ్, సిల్వర్ ఏసెంట్స్
  • 2 ఫ్రంట్ ట్వీటర్స్, రియర్ వైపర్, వాషర్, రియర్ డిఫాంగర్
  • టూ సైడ్ ఎయిర్ బ్యాగ్స్