Twitter Personal Data : ట్విట్టర్ యూజర్లకు హెచ్చరిక.. మీ మొబైల్ నెంబర్ సేవ్ చేశారా? వెంటనే ఇలా డిలీట్ చేయండి.. లేదంటే అమ్మేస్తారు జాగ్రత్త..!
Twitter Personal Data : ట్విట్టర్ యూజర్లకు హెచ్చరిక.. మీ పర్సనల్ డేటా డేంజర్‌లో ఉంది తస్మాత్ జాగ్రత్త.. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ (Twitter)లో యూజర్లు తమ పర్సనల్ డేటాను సేవ్ చేస్తుంటారు. అందులో ప్రధానంగా ట్విట్టర్ అకౌంట్ వినియోగం కోసం తమ మొబైల్ నెంబర్లను కూడా సేవ్ చేస్తుంటారు.

Delete Your Phone Number From Twitter Before They Sell It, Follow These Steps
Twitter Personal Data : ట్విట్టర్ యూజర్లకు హెచ్చరిక.. మీ పర్సనల్ డేటా డేంజర్‌లో ఉంది తస్మాత్ జాగ్రత్త.. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ (Twitter)లో యూజర్లు తమ పర్సనల్ డేటాను సేవ్ చేస్తుంటారు. అందులో ప్రధానంగా ట్విట్టర్ అకౌంట్ వినియోగం కోసం తమ మొబైల్ నెంబర్లను కూడా సేవ్ చేస్తుంటారు. అయితే, మీకు తెలియకుండానే మీ పర్సనల్ డేటా బ్లాక్ మార్కెట్లో సేల్ అవుతుందని తెలుసా? కొత్త నివేదిక ప్రకారం.. అడ్వటైజర్ల నుంచి ఆదాయాన్ని కోల్పోయిన తర్వాత ట్విట్టర్ మీకు నచ్చినా, నచ్చకపోయినా తమ అడ్వైజర్లకు యూజర్ల లొకేషన్ డేటా, ఫోన్ నంబర్‌లను విక్రయించాలని యోచిస్తోంది.
మీ అకౌంట్ నుంచి విలువైన డేటాను వెంటనే డిలీట్ చేయడం మంచిది. అందుకు ఇదే సరైన సమయం. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ టేకోవర్ చేసినప్పటినుంచి ప్లాట్‌ఫారమ్ అనేక మార్పులను చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ట్విట్టర్ యూజర్ల పర్సనల్ డేటా ముప్పు ఏర్పడే అవకాశం లేకపోలేదు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా మీ పర్సనల్ డేటాను వెంటనే అకౌంట్లలో నుంచి డిలీట్ చేయడం చాలా మంచిదని గమనించాలి.

Twitter Personal Data : Delete Your Phone Number From Twitter Before They Sell It, Follow These Steps
ట్విట్టర్ నుంచి మీ ఫోన్ నంబర్‌ను ఎలా డిలీట్ చేయాలంటే? :
మీరు మీ ఫోన్ నంబర్‌ను Twitterలో సేవ్ చేశారా? దాన్ని డిలీట్ చేయడానికి మీరు మీ ట్విట్టర్ అకౌంట్ ఫోన్ Settings పేజీకి వెళ్లవచ్చు. అయితే, మీరు SMS ద్వారా లాగిన్ కోడ్ (Login Code)లను స్వీకరిస్తే మీ నంబర్‌ను స్క్రబ్ చేయలేరు. అందుకే, మీ ఫోన్ నంబర్‌ని డిలీట్ చేయడానికి ముందే టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆప్షన్‌కు మారాల్సి ఉంటుంది. SMS-ఆధారిత లాగిన్ కోడ్ ఎప్పటికీ కూడా సేఫ్ కాదని గుర్తించాలి. ఈ అథెంటికేషన్ యాప్స్ మరింత సేఫ్ మాత్రమే కాదు.. ఎంతో లాభదాయకంగా ఉంటాయి. మీ డేటాను విక్రయించే కంపెనీలతో మీ ఫోన్ నంబర్‌ను షేర్ చేయడాన్ని నివారించడంలో సాయపడతాయి.
మీరు చేయాల్సిందిల్లా.. ట్విట్టర్ two-factor authentication పేజీకి వెళ్లాలి. ఇక్కడ మీరు టెక్స్ట్ మెసేజ్ (Text message) ఆప్షన్ ఎనేబుల్ చేయవద్దు. మీరు ఓ యాప్‌కి మారవచ్చు మరియు లాగిన్ కోడ్‌లను స్వీకరించడానికి 1పాస్‌వర్డ్, Google Authenticator లేదా Authentication వంటి యాప్‌లను ఉపయోగించవచ్చు. మీరు (YubiKey) వంటి ఫిజికల్ సెక్యూరిటీ కీని కలిగి ఉంటే.. మీరు మీ Twitter లాగిన్‌లను authenticate చేసేందుకు ఉపయోగించవచ్చు.

Twitter Personal Data : Delete Your Phone Number From Twitter Before They Sell It
Twitter నుంచి మీ లొకేషన్ డేటాను ఎలా Remove చేయాలంటే? :
మీ అన్ని ట్వీట్లను జియోట్యాగ్ (geotag) చేయడం చాలా ప్రమాదకరం.. ఎందకంటే… మీ లొకేషన్ ట్యాగ్ మీరు ట్వీట్ చేస్తున్నప్పుడు.. మీరు ఎక్కడ ఉన్నారో కచ్చితంగా తెలియజేస్తుంది. ఇంటర్నెట్‌లో ప్రతి ఒక్కరికీ ఆ డేటా అందుబాటులో ఉండకూడదనే విషయం తప్పక తెలుసుకోవాలి. ట్విట్టర్ మీ లొకేషన్ డేటాను అడ్వైజర్లకు విక్రయించే అవకాశం ఉంది. కంపెనీకి మీ డేటాను సేల్ చేయకుండా నివారించవచ్చు. మీ iPhoneలో Settings > Privacy > Location వెళ్లి Twitter కోసం లొకేషన్ యాక్సెస్‌ని Remove చేయండి. ఇదే విధమైన సెట్టింగ్‌ల పేజీ Androidలో కూడా అందుబాటులో ఉంది.
అయితే, ఈ విధానం మీ డివైజ్ బట్టి మారుతుంది. అన్ని ఫోన్లలో ఆప్షన్లు ఒకేలా ఉండవు. మీరు Location పేజీని కనుగొని Twitter యాక్సెస్‌ను డిసేబుల్ చేయాలి. Android Settings యాప్‌లోని సెర్చ్ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. చివరగా, మీరు పాత ట్వీట్‌లకు యాడ్ చేసిన మొత్తం లొకేషన్ డేటాను కూడా డిలీట్ చేయాలి. Twitter Location Settings పేజీకి వెళ్లి , మీ ట్వీట్‌లకు యాడ్ చేసిన డేటాను Remove All location information ఎంచుకోండి. ఆ తర్వాత Delete ఎంచుకోండి. అంతే.. మీ లొకేషన్ డేటా, మొబైల్ నెంబర్ డేటా మొత్తం ట్విట్టర్ అకౌంట్ నుంచి డిలీట్ అయిపోతుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..