First Electric Vehicle: ఇండియా తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే.. ‘ద లవ్ బర్డ్’

ఆటోమొబైల్ రంగంలో ఇండియా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం కార్ సెగ్మెంట్ లో మ్యాన్యుఫ్యాక్చర్లు అద్భుతంగా ఆలోచిస్తున్నారు. అయితే ఆటోమొబైల్ రంగం ఆరంభంలో డిఫరెంట్ టెక్నాలజీస్‌తో..

First Electric Vehicle: ఇండియా తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే.. ‘ద లవ్ బర్డ్’

The Love Bird

First Electric Vehicle: ఆటోమొబైల్ రంగంలో ఇండియా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం కార్ సెగ్మెంట్ లో మ్యాన్యుఫ్యాక్చర్లు అద్భుతంగా ఆలోచిస్తున్నారు. అయితే ఆటోమొబైల్ రంగం ఆరంభంలో డిఫరెంట్ టెక్నాలజీస్ తో పలు ప్రయోగాలు చేసింది. శక్తి వనరుల ఆధారంగా కార్లను డిజైన్ చేసింది. ఈ కోవలోనే లాంచ్ అయింది ఎలక్ట్రిక్ కార్.. ‘ద లవ్ బర్డ్’

ఎడ్డీ ఎలక్ట్రిక్ సిరీస్ ఈ లవ్ బర్డ్ ను 1993లో రెడీ చేసింది. తొలిసారి దీనిని ఢిల్లీలోని ఆటో ఎక్స్ పోలో ఉంచారు. దీని లాంచింగ్ లోనే అవార్డులు కూడా గెలుచుకుంది. ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కాకపోతే అమ్మకాలు తక్కువగా ఉండటంతో ప్రొడక్షన్ ఆపేయాల్సి వచ్చింది.

ఈ ఎలక్ట్రిక్ కారును ఎడ్డీ కరెంట్ కంట్రోల్స్ తో పాటు యస్కవా ఎలక్ట్రిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కలిసి తయారుచేశఆరు. చాలాకుడీ, కేరళ్, కొయంబత్తూర్, తమిళనాడులో దీని ప్రొడక్షన్ జరిగింది. ఇది టూ సీటర్ కారుమాత్రమే. కార్ మోటార్ రీఛార్జెబుల్ బ్యాటరీతో నడిచేది.

అప్పట్లో బ్యాటరీ బ్యాకప్ లు అంతగా ఇంప్రూవ్ గా ఉండకపోవడంతో యాసిడ్ బ్యాటలీలు వాడేవారు. కారులో వాడిన యాసిడ్ బ్యాటరీలో ఎన్ని కణాలు ఉండే విషయం స్పష్టనత లేదు. బ్యాటరీ దీనిని కంట్రోల్ చేయడానికి ఒక ఎలక్ట్రానిక్ చాపర్ వాడే వాళ్లు. దాంతో పాటుగా చాపర్ కూడా వచ్చేది. అది వాడి స్పీడ్ కంట్రోల్ సిస్టమ్ ను స్మూత్ గా నడిపించేది.

నాలుగు గేర్లు ముందుకు ఒక రివర్స్ గేర్ తో ఇతర కార్లకు ధీటుగా పోటీగా వచ్చింది. ఫుల్ ఛార్జ్ పెడితే 60కిలోమీటర్ల వరకూ ప్రయాణించేది. కొద్ది రోజుల తర్వాత కారుకు 15డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే ప్రయాణించకూడదని ఆంక్షలు పెట్టారు. అది లీగల్ కూడా కాదు. అందుకే కార్ల ప్రొడక్షన్ ఆగిపోయింది.

వంద కార్ల కంటే ఎక్కువ అమ్మలేకపోయారు. పెట్రోల్, డీజిల్ సీఎన్జీ కార్ల మార్కెట్ నడుస్తున్న సమయంలో పోటీ ఇవ్వలేకపోయింది. ఎలక్ట్రిక్ సప్లైలో ఫెయిల్యూర్స్, కొరత దీనికి కారణంగా మారింది. ఉన్నట్లుండి ప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్ కొనుగోళ్లకు సబ్సిడీ ఇవ్వడం మానేయడంతో కాస్ట్లీగా మారింది.

ఆ సమయంలో వచ్చిన మారుతీ సుజుకీ 800మార్కెట్ ని ఒక ఊపు ఊపింది. మిగిలిన వాటికంటే బెస్ట్ సర్వీస్ అందించడం మొదలుపెట్టింది.