8వ అంతస్తు నుంచి Redmi note 8 కిందకు జారి పడింది.. స్క్రీన్ పగిలినా.. పనిచేస్తోంది!

  • Published By: sreehari ,Published On : August 29, 2020 / 05:14 PM IST
8వ అంతస్తు నుంచి Redmi note 8 కిందకు జారి పడింది.. స్క్రీన్ పగిలినా.. పనిచేస్తోంది!

Redmi Note 8 survives drop from eighth floor : ఎత్తైన ప్రదేశం నుంచి ఏదైనా స్మార్ట్ ఫోన్ పడిస్తే.. ఏమౌతుంది? స్ర్కీన్ పగిలి ముక్కలైపోతుంది.. పనికిరాకుండా పోతుంది.. కానీ, షావోమీ సబ్ బ్రాండ్ కంపెనీ రెడ్ మి తయారుచేసిన ఓ స్మార్ట్ ఫోన్ మోడల్ మాత్రం కింద పడినా పనిచేస్తోంది.. ఎనిమిదో అంతస్తు నుంచి జారిపడి స్ర్కీన్ పగిలినా చక్కగా పనిచేస్తోందంట.

రెడ్ మి నుంచి కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తూనే ఉంది , Xiaomi.. ఈ ఏడాదిలో రెడ్ మి 9 సిరీస్ మార్కెట్లోకి వచ్చింది.. గత ఏడాది వరకు ప్లాస్టిక్ డిజైన్ బాడీతో వచ్చిన రెడ్ మి స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు రెడ్ మి నోట్ 8 నుంచి గ్లాస్ బాడీతో మార్కెట్లోకి వస్తున్నాయి.. సబ్ రేంజ్ ధర రూ.15వేల విభాగంలో రెడ్ మి ఫోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి..



GizmoChina నివేదిక ప్రకారం.. రెడ్‌మి నోట్ 8 యూజర్లలో ఒకరు తన పగిలిన ఫోన్ ఫోటోను షేర్ చేసుకున్నారు. రెడ్‌మి నోట్ 8వ ప్లోర్ నుంచి జారి నేరుగా స్విమ్మింగ్ ఫూల్‌లో పడింది. అంత ఎత్తు నుంచి కింద పడటంతో రెడ్ మి నోట్ 8 ఫోన్‌ బాగా దెబ్బతిన్నది. స్ర్కీన్ పగిలిపోయింది.. అయినా ఫోన్ మాత్రం చక్కగా పనిచేస్తుందంట. కెమెరా పనిచేయడం లేదు..

ఫోన్ పైభాగంలోని ఎడ్జ్ గాజు మొత్తం పగిలి పోయింది.. టచ్‌స్క్రీన్ మాత్రం సాధారణంగా పనిచేస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ కూడా అవుతుందంట.. కెమెరాలోకి నీళ్లు వెళ్లాయి.. కానీ ఫోన్ లోని మిగతా పార్టులు మాములుగానే పనిచేస్తున్నాయంట.. పగిలిపోయిన గాజుతో పాటు ఇతర భాగాలను కలిపి ఫోన్ టేప్‌తో చుట్టి ఉంచారు.



రెడ్‌మి నోట్ 8 ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో వచ్చిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. భారత మార్కెట్లో షియోమి తమ రెడ్‌మి నోట్ 8 స్మార్ట్ ఫోన్లకు వాటర్ ఫ్రూప్ రక్షణగా ఉండటానికి P2i నానోకోటింగ్‌ను వాడుతోంది. 2020లో రెడ్‌మి నోట్ 8 రూ .15,000 లోపు గ్లాస్ ప్యానెల్ కలిగిన స్మార్ట్ ఫోన్లలో ఒకటిగా నిలిచింది.

రెడ్‌మి నోట్ 8 భారత మార్కెట్లో ఇంకా అందుబాటులోనే ఉంది.. రెడ్‌మి నోట్ 9 రిలీజ్ చేశాక కూడా షియోమి ఇండియాలో రెడ్‌మి నోట్ 8 అమ్మకాన్ని కొనసాగిస్తోంది. రెడ్‌మి నోట్ 8తో పాటు, రెడ్‌మి నోట్ 8 Pro ప్రారంభ ధర రూ .15,999కు లభ్యం అవుతోంది.



ఈ ఫోన్ హెలియో G90 T గేమింగ్ చిప్‌సెట్, 8GB RAMతో వచ్చింది. అమెజాన్ అలెక్సా ప్రీ-లోడెడ్‌తో వచ్చిన మొట్టమొదటి షియోమి ఫోన్ కూడా ఇదే… ఆకర్షణీయమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది.