Samsung Galaxy S23 Series : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Samsung Galaxy S23 Series :  శాంసంగ్ వినియోగదారులకు అలర్ట్.. శాంసంగ్ గెలాక్సీ S సిరీస్‌లో కొత్త మోడల్ కోసం చూస్తున్నారా? అయితే త్వరలోనే మీకు నచ్చిన గెలాక్సీ S సిరీస్ మోడల్ రాబోతోంది.

Samsung Galaxy S23 Series :  శాంసంగ్ వినియోగదారులకు అలర్ట్.. శాంసంగ్ గెలాక్సీ S సిరీస్‌లో కొత్త మోడల్ కోసం చూస్తున్నారా? అయితే త్వరలోనే మీకు నచ్చిన గెలాక్సీ S సిరీస్ మోడల్ రాబోతోంది. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన మోడళ్లలో కన్నా గెలాక్సీ S23 సిరీస్ అద్భుతమైన ఫీచర్లతో రానుంది. అతి త్వరలో భారత మార్కెట్లో ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి గెలాక్సీ S23 సిరీస్ లాంచ్ కానుంది.

అధికారిక ప్రకటనకు ముందే.. శాంసంగ్ వెబ్‌సైట్ Samsung Unpacked లాంచ్ డేట్ నిర్ధారించింది. శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. అయితే Samsung అధికారిక కొలంబియా వెబ్‌సైట్ ఫిబ్రవరి 1న కొత్త సిరీస్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

రాబోయే ఫోన్‌లకు సంబంధించి వివరాలను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. కానీ, రాబోయే గెలాక్సీ S23 సిరీస్ ఫోన్‌లో 3 కెమెరాలు ఉన్నాయి. డివైజ్ కలర్ వేరియంట్‌లతో రానుంది. శాంసంగ్ డిజైన్‌ను ఫోన్ల రెండర్‌లు ఇంటర్నెట్‌లో చాలాసార్లు లీక్ అయ్యాయి. Galaxy S23 సిరీస్‌లో పెద్ద మార్పు ఉండకపోవచ్చు.

Read Also : Samsung Galaxy F04 : శాంసంగ్ గెలాక్సీ F04 వచ్చేసిందోచ్.. రూ.7,499లకే సొంతం చేసుకోవచ్చు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఎప్పటినుంచంటే?

శాంసంగ్ Galaxy S22 డిజైన్‌లకు చాలా పోలి ఉండనుంది. SnoopyTech పేరుతో టిప్‌స్టర్ కంపెనీ లాంచ్ చేయనున్న రెండు ఫోన్‌లు Galaxy S23, Galaxy S23 Ultra అధికారిక లీక్‌లను వెల్లడించింది. కాటన్ ఫ్లవర్, మిస్ట్లీ లిలక్, బొటానిక్ గ్రీన్, ఫాంటమ్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్లలో స్మార్ట్‌ఫోన్‌లు లీక్ అయ్యాయి.

Samsung confirms launch date of Galaxy S23 series

రాబోయే గెలాక్సీ S23 సిరీస్ డిజైన్, స్పెక్స్ పూర్తిగా లీక్ కాలేదు. నివేదికల ప్రకారం.. గెలాక్సీ S23 అల్ట్రా 200-MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. స్పెసిఫికేషన్ల పరంగా.. రెండు మోడల్‌లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2ని కలిగి ఉన్నాయని చెప్పవచ్చు.

TSMC ద్వారా 4nm ఫాబ్రికేషన్ ప్రాసెస్‌పై పనిచేస్తుంది. ప్రాసెసర్ స్మార్ట్‌ఫోన్‌ల మొత్తం CPU, GPU పనితీరును ఖచ్చితంగా పెంచుతుంది. శాంసంగ్ Galaxy S23 సిరీస్ ఫోన్ సాధారణ మోడల్‌లు RAM పరంగా భారీ అప్‌డేట్స్ ఉండకపోవచ్చు. గెలాక్సీ S22 సిరీస్ వంటి 8GB RAM ఆప్షన్లను మాత్రమే కలిగి ఉంది. Galaxy S23 Ultra 1TB స్టోరేజ్‌తో పాటు 12GB RAM వేరియంట్‌ను చూడవచ్చు. బ్యాటరీ విషయానికొస్తే.. Galaxy S23 Ultra బ్యాటరీ దాని ముందున్న Galaxy S22 Ultra మాదిరిగా అదే 5000mAh బ్యాటరీతో రానుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy A-series : శాంసంగ్ నుంచి 2 గెలాక్సీ A సిరీస్ 5G ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఈ నెలాఖరులోనే లాంచ్.. ఫీచర్లు ఏంటి? ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు