Kodandaram RS Praveen Kumar : కోదండరామ్‌తో RS ప్రవీణ్ కుమార్ కీలక భేటీ

TSPSC పేపర్ లీకేజీ కుంభకోణం అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పేపర్ లీకేజీల కుంభకోణాన్ని సీబీఐకి అప్పగిస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్న చర్చ జరిగింది.

Kodandaram RS Praveen Kumar : తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ.. బీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని విపక్ష నేతలు ఆరోపించడం సంచలనంగా మారింది. మరోవైపు అధికార పార్టీ కూడా అంతే ధీటుగా ఎదురుదాడికి దిగుతోంది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతోంది.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు పార్టీలు జట్టు కడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాంతో తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అవడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ప్రైవేట్ ప్లేస్ లో వీరిద్దరూ సమావేశం అయ్యారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిణామాల మీద వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.

Also Read..TSPSC paper leak: రూ.100 కోట్ల మేర దావా… రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు

టీజేఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న తెలంగాణ బచావో ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని RS ప్రవీణ్ ను కోరినట్టు సమాచారం. ఇరువురి మధ్య TSPSC పేపర్ లీకేజీ కుంభకోణం అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పేపర్ లీకేజీల కుంభకోణాన్ని సీబీఐకి అప్పగిస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్న చర్చ జరిగింది. దీని కోసం కలిసి వచ్చే పార్టీలతో, ప్రజాసంఘాలతో, విద్యార్థి, నిరుద్యోగ సంఘాలతో త్వరలోనే ఉమ్మడి ఉద్యమ కార్యాచరణను విస్తృతం చేయాలని కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయించారు.

ట్రెండింగ్ వార్తలు